E-Paper
Advertisement

ప్రాణాలు కాపాడిన డాక్టర్‌పైనే పిచ్చి… పెళ్ళాం ఉన్నా వదలకుండా ఇదేం అరాచకం భయ్యా

ప్రాణాలు కాపాడిన డాక్టర్‌పైనే పిచ్చి… పెళ్ళాం ఉన్నా వదలకుండా ఇదేం అరాచకం భయ్యా
Advertisement

Telugu psychological Thriller Movie on OTT: ఒక డాక్టర్ కుటుంబం… భార్యాభర్తల మధ్య ఎంతో అనుబంధం… పిల్లలతో ప్రశాంతమైన జీవితం… ఇలాంటి కుటుంబంలోకి అనుకోకుండా ఓ అపరిచిత యువతి వస్తే ఏం జరుగుతుంది ? మొదట ఆమెను కాపాడిన వ్యక్తే ఆమెకు దేవుడిలా కనిపిస్తాడు. కానీ కొద్దిరోజుల్లో అదే కుటుంబంలో చిచ్చు పెట్టే వ్యక్తిగా మారుతుంది. భర్తకు రహస్య సందేశాలు, భార్యకు అనుమానాలు, ఇంట్లో భయపెట్టే సంఘటనలు… ఇలా ఒక్కొక్కటిగా సమస్యలు పెరుగుతుంటాయి. కానీ ఇదంతా కేవలం ఓ సైకో యువతి చేసిన పని కాదని తెలిసినప్పుడు కథ మరో మలుపు తిరుగుతుంది. పదేళ్ల క్రితం జరిగిన ఓ విషాదకరమైన ఘటనకు ఈ కుటుంబంతో ఉన్న సంబంధం బయటపడటంతో అసలు ఆట మొదలవుతుంది. ఆ అమ్మాయికి ఆ కుటుంబంపై అంత కక్ష ఎందుకు? ఇదే ఆసక్తిని కలిగించే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘వదలా’ (Vadala) కథ. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

యోగి సిద్ధార్థ్ ఓ ప్రముఖ డాక్టర్. భార్య ప్రియ, ఇద్దరు పిల్లలు, అనారోగ్యంతో వీల్‌చైర్‌కు పరిమితమైన మామతో కలిసి ప్రశాంతంగా జీవిస్తుంటాడు. ఆ కుటుంబంలో ఎలాంటి పెద్ద సమస్యలు ఉండవు. భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. పిల్లలు కూడా తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటారు. అలాంటి సమయంలో ఓ రోజు యోగి కంటికి రోడ్డు ప్రమాదానికి గురైన ఓ యువతి కనిపిస్తుంది. ఆమె పేరు అముద. డాక్టర్‌గా తన బాధ్యతగా భావించిన యోగి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తాడు. ప్రాణాపాయం నుంచి బయటపడిన అముద కోలుకున్న తర్వాత యోగి కుటుంబానికి దగ్గరవుతుంది.

Advertisement

అనుకోకుండా యోగి కుటుంబం నివసించే ఇంటికి ఎదురుగానే ఓ ఫ్లాట్‌లో ఆమె దిగుతుంది. మొదట్లో ఆమెతో కుటుంబ సభ్యులందరూ సాధారణంగానే ఉంటారు. అముద కూడా చాలా మంచిగా, ఆప్యాయంగా ప్రవర్తిస్తూ అందరి నమ్మకాన్ని సంపాదించుకుంటుంది. కానీ ఆమె మనసులో మాత్రం మరో ఆలోచన ఉంటుంది. యోగి, ప్రియల మధ్య ఉన్న ప్రేమను గమనించిన అముదకు వాళ్ల సంతోషం నచ్చదు. ముఖ్యంగా యోగి తన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తిగా మారాలని ఆమె కోరుకుంటుంది. అందుకోసం ముందుగా భార్యాభర్తల మధ్య అనుమానాలు పెంచాలని ప్లాన్ చేస్తుంది.

యోగికి రహస్యంగా మెసేజ్‌లు పంపడం, బొకేలు పంపించడం, అతనిపై తనకు ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నట్లు కనిపించేలా చేయడం మొదలుపెడుతుంది. అదే సమయంలో ప్రియ తండ్రిని భయపెట్టే సంఘటనలకు కూడా పాల్పడుతుంది. దీంతో ప్రియకు ఒక్కసారిగా తన భర్తపై అనుమానం మొదలవుతుంది. తన భర్తకు అముదతో ఏదైనా సంబంధం ఉందా? అముద ఎందుకు తమ కుటుంబానికి ఇంత దగ్గరవుతోంది? ఆమె చేస్తున్న పనుల వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? అనే ప్రశ్నలు ప్రియను వెంటాడతాయి.

Advertisement

చిన్న చిన్న అనుమానాలు క్రమంగా భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతాయి. ఎంతో ప్రేమగా ఉన్న కుటుంబంలో ప్రశాంతత మాయమవుతుంది. అముద మాత్రం బయటకు అమాయకురాలిలా కనిపిస్తూ, తన ప్లాన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఇదే సమయంలో కథ మరో దిశలో ప్రయాణం మొదలుపెడుతుంది. పదేళ్ల క్రితం జరిగిన ఓ దీపావళి సిలిండర్ పేలుడు ఘటనపై పోలీస్ అధికారి పద్మాకర్ మళ్లీ దృష్టి పెడతాడు. ఆ ప్రమాదంలో నివాస్ అనే వ్యక్తి మరణిస్తాడు. అప్పట్లో అది ప్రమాదంగానే భావించినా… పదేళ్ల తర్వాత ఆ కేసులో కొన్ని అనుమానాస్పద విషయాలు బయటకు వస్తాయి.

పాత కేసును తిరిగి పరిశీలిస్తున్న కొద్దీ పద్మాకర్‌కు కొన్ని ఆధారాలు దొరుకుతాయి. ఆ ఆధారాలు చివరకు యోగి కుటుంబం వైపు చూపించడం మొదలవుతుంది. అప్పటి వరకు అముదను కేవలం ఓ సైకో యువతిగా చూసిన ప్రేక్షకుడికి కూడా ఇక్కడ అసలు ప్రశ్న మొదలవుతుంది. అముద నిజంగా ఎవరు? ఆమె యోగి కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసింది? పదేళ్ల క్రితం జరిగిన ఆ సిలిండర్ పేలుడు వెనుక అసలు నిజం ఏంటి? నివాస్ మరణానికి యోగి కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటి?

ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఒక్కొక్కటిగా బయటపడే కొద్దీ అముద చేస్తున్న పనులకు అసలు కారణం అర్థమవుతుంది. ఒకవైపు కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యోగిపై ఉంటుంది. మరోవైపు భార్య ప్రియ తన భర్తపై వచ్చిన అనుమానాలను పక్కనపెట్టి అసలు నిజాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. పోలీస్ అధికారి పద్మాకర్ పాత కేసును సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుండగా… చివరికి పదేళ్ల క్రితం జరిగిన ఘటన బయటపడుతుంది. అముద వేసిన ఒక్కో ఎత్తును చిత్తు చేస్తూ యోగి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? ప్రియ తన భర్తను నమ్మిన తర్వాత అసలు నిజం ఎలా బయటపడింది? పాత కేసులో దాగి ఉన్న అసలు దోషులు ఎవరు? అనేదే క్లైమాక్స్ లో చూడాల్సిన కథ.

తెలుగులోనే స్ట్రీమింగ్

‘వదలా’ ఓ కుటుంబంలోకి ఓ అపరిచితురాలు రావడంతో మొదలై… భార్యాభర్తల మధ్య అనుమానాలు, సైకలాజికల్ గేమ్స్, పదేళ్ల నాటి క్రైమ్, ప్రతీకారం చుట్టూ తిరిగే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా సాగుతుంది. ప్రస్తుతం Amazon Prime Videoలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహించారు.

Read Also: పేదలకు నరకం… ధనవంతులకు స్వర్గం ఈ రైలు… లైఫ్ లో మరచిపోలేని థ్రిల్లిచ్చే సర్వైవల్ థ్రిల్లర్

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×