E-Paper
Advertisement

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?
Advertisement

Gadwal: స్వేచ్చ బ్యూరో: గద్వాల మున్సిపాలిటీలో మున్సిపల్‌ షాపుల అద్దెలకు సంబంధించి వసూలు చేసిన రూ.11.28 లక్షలు సంబంధిత అధికారులు మున్సిపల్‌ ఖాతాలో జమ చేయకపోవడాన్ని తీవ్ర తప్పిదంగా పరిగణిస్తూ జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్ భాషా షేక్ మంగళవారం తగు చర్యలు చేపట్టారు.
ఈ వ్యవహారంలో టీ. రాజేష్ కుమార్, రెవెన్యూ ఆఫీసర్ ను కూడా విచారణ అనంతరం సస్పెండ్ చేసినట్లు తెలియజేశారు. సీనియర్‌ అసిస్టెంట్‌, ఇన్‌చార్జ్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రాజవర్ధన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఇన్‌చార్జ్‌ షరాఫ్‌ రాజవర్ధన్‌ నాయుడులను సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌) నర్సింగరావును విచారణ అధికారిగా నియమించారు. సంబంధిత రశీదు పుస్తకాలు, రికార్డులు, రిమిటెన్స్‌ వివరాలను పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

నిధులు దుర్వినియోగం..

మున్సిపాలిటీ రెవెన్యూ విభాగంలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఒక్కరు మున్సిపాలిటీకి చెందిన షాపుల అద్దె సొమ్ము వసూళ్లు చేసి అందులో నుండి రూ.11 లక్షల పై చిలుకు దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై గద్వాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ జానకీరాం సాగర్‌ గతంలో వెల్లడించారు. కాగా, దుర్వినియోగమైనట్లు గుర్తించిన రూ.11 లక్షలకు పైగా సొమ్మును సోమవారం మున్సిపల్‌ క్యాషియర్‌ విభాగంలో జమ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని కమిషనర్‌ తెలిపారు.

Advertisement

Also read: నమస్కారం చేసేటప్పుడు రెండు చేతుల వేళ్లు కలిస్తే మెదడులో ఏం జరుగుతుంది?

విచారణలో..

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి అద్దె సొమ్ము వసూళ్ల బాధ్యత అప్పగించిన విధానం, సంబంధిత పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించిన అధికారులు, సిబ్బంది పాత్రపైనా విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. విచారణలో సొమ్ము దుర్వినియోగానికి సంబంధించి ఎవరి బాధ్యత ఎంత మేరకు ఉందనే అంశాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చిన అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ తెలిపారు.

Advertisement

Also read: రేవంత్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు.. కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్‌…! సీఎం టూర్‌ తరువాత మరో పథకం అనౌన్స్‌మెంట్‌కు సన్నాహాలు..?

Tags

Related News

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

దొంగ ఓట్లతోనే మోదీ, అమిషా అధికారంలోకి వచ్చారు.. ఆధారాలతో విరుచుకుపడ్డ రఘువీరా రెడ్డి!

ఆ ఛాంబర్ ముందు ఆంక్షలు ఎందుకు.. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రభుత్వ ఉద్యోగులు ఫైర్!

Big Stories

Advertisement
×