E-Paper
Advertisement

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!
Advertisement

OYO Hotel Murder: స్వేచ్చ బ్యూరో: మాదాపూర్ లోని ఓయో హోటల్ లో జరిగిన హత్యను మరిచిపోకముందే ఎస్ఆర్ నగర్ లో మరో ఘాతుకం వెలుగు చూసింది. గోకుల్ ప్రైడ్ అనే ఓయో హోటల్‌ లో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. మంగళవారం ఉదయం హోటల్ లోని 103 నెంబర్ గదిలో మహిళ రక్తసిక్త గాయాలతో చనిపోయి ఉండటం చూసి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తనిఖీల్లో గదిలో ఓ ఆధార్ కార్డు దొరికింది. దానిపై దుర్గ అని పేరు రాసి ఉంది. అయితే, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందినట్టు దొరికిన రికార్డులపై శిరీష అని రాసి ఉంది. ఇక, హోటల్ గదిని గణేష్ అన్న పేరు మీద బుక్ చేసినట్టు విచారణలో వెళ్లడయ్యింది.

పరార్‌లో యువకుడు..

రెండు రోజుల క్రితం మహిళ, మరో వ్యక్తి హోటల్లో చెక్ ఇన్ అయినట్టు తేలింది. లభించిన ఆధారాలతో పోలీసులు జరిపిన విచారణలో హతురాలు వికారాబాద్ జిల్లా ధరూర్ కు గ్రామానికి చెందిన శిరీషగా నిర్ధారణ అయ్యింది. కోటిపల్లికి చెందిన శ్రీనివాస్ తో ఆమె ప్రేమలో ఉన్నట్టుగా తెలిసింది. రెండు రోజుల క్రితం ఇద్దరు పారిపోయి హైదరాబాద్ వచ్చి హోటల్లో బస చేసినట్టుగా తెలియవచ్చింది. కేసులు నమోదు చేసిన ఎస్ఆర్ నగర్ పోలీసులు పరారీలో ఉన్న శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు.

మాదాపూర్ కేసులో నిందితుని అరెస్ట్..

Advertisement

ఇక, మాదాపూర్ లోని ఓయో హోటల్ లో జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. ఈనెల 21న మాదాపూర్‌ లోని సిద్ధికి నగర్‌ లో ఓయో రూమ్‌లో యువతి, యువకుడు దిగారు. అదే రోజు రాత్రి యువతి హత్యకు గురైంది. యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లిందని హోటల్ సిబ్బందికి చెప్పి సమీపంలోని హాస్పిటల్‌ కు నిందితుడు తరలించాడు. ఆస్పత్రిలో యువతి చనిపోయిందని చెప్పడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. విచారణలో హతురాలు నిఖిత అని వెళ్లడయ్యింది. ఆమెతోపాటు హోటల్ లో బస చేసింది శ్రీనివాస్ రవితేజ అని గుర్తించారు. ఈ క్రమంలో శ్రీనివాస్ రవితేజ గురించి పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా, ఇక్కడి నుంచి పారిపోయిన శ్రీనివాస్ రవితేజ ఆంధ్రప్రదేశ్‌ లోని తన స్వగ్రామానికి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశాడు. దాంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. శ్రీనివాస్ రవితేజ కోలుకుని డిశ్చార్జ్ కాగానే మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also read: చైల్డ్ ఆర్టిస్ట్ గా వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? బానే డిమాండ్ చేశాడే?

Tags

Related News

దొంగ ఓట్లతోనే మోదీ, అమిషా అధికారంలోకి వచ్చారు.. ఆధారాలతో విరుచుకుపడ్డ రఘువీరా రెడ్డి!

ఆ ఛాంబర్ ముందు ఆంక్షలు ఎందుకు.. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రభుత్వ ఉద్యోగులు ఫైర్!

అదుపుతప్పి మాట్లాడితే మహిళలతో కొట్టిస్తాం: కొండా సురేఖ

ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్లు.. రెడ్ హిల్స్‌లో శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

నీ చేతకాని తనాన్ని పార్టీ అధినేత పై మోపుతావా.. కేటీఆర్ పై కవిత ఫైర్!

గంజాయి స్మగ్లర్ల అరాచకాలకు ఇక చెక్.. ఎక్సైజ్ పోలీసుల చేతికి ఆయుధాలు..?

కవిత చెప్పినట్లుగా హరీష్ రావు గుంటనక్కే.. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×