E-Paper
Advertisement

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!
Advertisement

Police Assault: స్వేచ్ఛ బ్యూరో: పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళలేక, తిరిగి తనను మళ్ళీ కొడతారన్న భయంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం బిలాల్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కోహిర్ మండలం బిలాల్ పూర్ గ్రామానికి చెందిన శేఖర్(30) ఓ బంగారం చోరీ కేసులో నిందితుడిగా అనుమానించి సోమవారం జహీరాబాద్ పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ శేఖర్ ను విచారణ పేరుతో విచక్షణ రహితంగా, నడవడానికి రాని విధంగా లాఠీలతో తీవ్రంగా కొట్టినట్లు బంధువులు ఆరోపించారు. అదే రోజు రాత్రి శేఖర్ ను పోలీసులు తీసుకుపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులు కోహిర్ మాజీ జెడ్పిటిసి నరసింహులుకు తెలియజేశారు.

తీవ్రంగా గాయపడ్డ శేఖర్..

సోమవారం రాత్రి 11 గంటల సమయంలో నరసింహులు జహీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులతో మాట్లాడి అతను షూరిటీ ఇచ్చి శేఖర్ ను బిలాల్ పూర్ తీసుకొని వచ్చి అతని ఇంట్లో వదిలారు. షూరిటీపై శేఖర్ ను వదులుతున్న సమయంలోనే మంగళవారం ఉదయం మళ్లీ పోలీస్ స్టేషన్ కు తీసుకురావాలని పోలీసులు ఆదేశించారు. అప్పటికే పోలీసు దెబ్బలతో తీవ్రంగా గాయపడ్డ శేఖర్ మంగళవారం తిరిగి తనను పోలీస్ స్టేషన్లో చితకబాదుతారన్న భయంతో మనస్థాపానికి గురై మంగళవారం ఉదయం తన ఇంట్లోఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి కంటి చూపులేని ఓ వృద్ధ తల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. కుటుంబ పోషణ భారం అంతా శేఖర్ దే కావడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాగా ఈ విషయమై జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్ ను వివరణ కోరగా ఓ దొంగతనం కేసులో శేఖర్ ను పోలీస్ స్టేషన్ కు తెచ్చిన మాట వాస్తవమేనన్నారు. మాజీ జెడ్పిటిసి నరసింహులు షూరిటీ ఇచ్చి తీసుకెళ్లాడన్నారు. శేఖర్ ను పోలీసులు కొట్టారన్న విషయాన్ని ఆయన ఖండించారు.

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా..

Advertisement

పోలీసులు విచక్షణారహితంగా కొట్టడం వల్లనే బిలాల్ పూర్ గ్రామానికి చెందిన శేఖర్ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక ఎమ్మెల్యే మాణికరావు ఆరోపించారు. శేఖర్ ను కొట్టిన ఎస్సై, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి జహీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ధర్నా నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మాణిక్ రావుతో సహా బి ఆర్ ఎస్ నాయకులను పోలీసులు పట్టణ సమీపంలోని పస్తాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Also read: 13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

Tags

Related News

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

దొంగ ఓట్లతోనే మోదీ, అమిషా అధికారంలోకి వచ్చారు.. ఆధారాలతో విరుచుకుపడ్డ రఘువీరా రెడ్డి!

ఆ ఛాంబర్ ముందు ఆంక్షలు ఎందుకు.. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రభుత్వ ఉద్యోగులు ఫైర్!

Big Stories

Advertisement
×