E-Paper
Advertisement

MLA Bandla meet CM Revanth: సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యే బండ్ల భేటీ, అదంతా తప్పు అంటూ..

MLA Bandla meet CM Revanth: సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యే బండ్ల భేటీ, అదంతా తప్పు అంటూ..
Advertisement

MLA Bandla meet CM Revanth reddy(Political news today telangana): తనపై వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. అవన్నీ ఫేక్ వార్తలంటూ చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులోభాగంగా శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యారు.

శుక్రవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇరువురు మధ్య దాదాపు అరగంటపాటు మంతనాలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తనపై కావాలనే
బీఆర్ఎస్ నేతలు బురద జల్లారంటూ చెప్పే ప్రయత్నం చేశారాయన. అవన్నీ తనకు తెలుసని, వాళ్లతో జాగ్రత్త ఉండాలని ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి సూచన చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

అనంతరం అక్కడికి వెళ్లిన నేతలతో కలిసి ఫోటో దిగారు. అక్కడినుంచి సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి అసెంబ్లీకి వెళ్లారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి. అయితే ఈ భేటీకి ముందు మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం మహూబూబ్‌నగర్ వెళ్లారు. అక్కడే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో మాట్లాడి అక్కడే బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఏం జరిగిందో తెలీదుగానీ 24 గంటల్లోగానే హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లారాయన. దీంతో ఆయన బీఆర్ఎస్‌లోకి వెళ్తారన్న వార్తలకు దాదాపు ఫుల్‌స్టాప్ పడింది.

ALSO READ: ఫలించని సెంటిమెంట్.. బుక్కైన కేటీఆర్

Advertisement

మరోవైపు నాలుగురోజుల కిందట బీఆర్ఎస్ నుంచి వచ్చిన కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పార్టీలో మీకు ఎలాంటి సమస్యలను ఉండవని, సీనియర్లతో కలిసి పని చేయాలని సూచన చేశారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలపై మాట్లాడారు. దీంతో జాయిన్ అయిన ఎమ్మెల్యేలంతా ఫుల్‌ఖుషీ అయ్యారు.

Related News

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

Big Stories

Advertisement
×