BigTV English

CM Revanth Reddy: నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ.. RRR సౌత్‌కు గ్రీన్ సిగ్నల్..

CM Revanth Reddy: నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ.. RRR సౌత్‌కు గ్రీన్ సిగ్నల్..
CM Revanth Reddy Met Nitin Gadkari

CM Revanth Reddy Met Nitin Gadkari: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. తెలంగాణ సీఎంతో పాటు ఉవముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు.


తెలంగాణ లోని 15 స్టేట్ హైవేస్‌ను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని సిక్స్ లేన్‌గా విస్తరించాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. రీజినల్ రింగ్ రోడ్డు సౌత్ భాగం డెవలప్‌మెంట్, హైదరాబాద్ కల్వకుర్తి ఫోర్ లేన్, హైదరాబాద్- శ్రీశైలం నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడర్‌ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గడ్కరీని కోరారు. రీజినల్ రింగ్ రోడ్డు సౌత్ భాగానికి కేంద్రం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy Met Nitin Gadkari

వీటితో పాటు సిర్పూర్- కాగజ్‌నగర్ జాతీయ రహదారి, భువనగిరి రహదారి, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేబుల్ బ్రిడ్జ్ వేరే చోటకి మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి, వాటి పెంపు గురించి చర్చించారు.


Read More: దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం.. ప్రారంభించిన ప్రధాని మోదీ..

ఇక నల్గొండలో ట్రాన్‌స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ ఏర్పాటు చేయాలని, నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి కేంద్ర మంత్రిని విన్నవించారు.

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×