BigTV English

Cyber crime: కొత్త తరహా మోసం.. స్విగ్గీ అకౌంట్‌తో ₹97వేలు చోరీ..

Cyber crime: కొత్త తరహా మోసం.. స్విగ్గీ అకౌంట్‌తో ₹97వేలు చోరీ..

Cyber crime: ఆన్‌లైన్‌ డెలివరీలు యాప్‌లు వినియోగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అలా ఓ మహిళ స్విగ్గీ అకౌంట్‌ నుంచి ఏకంగా రూ.97 వేలు దోచుకున్నారు. పెద్ద ఎత్తున ఆపర్లు ఇస్తాం.. లక్కీ డ్రా వచ్చింది బహుమతులు తీసుకెళ్లండి అంటూ అమాయక ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు నేరస్తులు.


అయితే ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు నేరగాళ్లు. ఆన్ లైన్ డెలివరీ యాప్ లు వినియోగిస్తున్న వారే లక్ష్యంగా చేసుకొని మోసాలకు తెరలేపారు నేరస్తులు. మీ ఖాతా హ్యాక్ అయ్యిందంటూ నమ్మించి మోసం చేస్తున్నారు నేరగాళ్లు. అలాంటి దారులకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్థులను పట్టుకొని అరెస్టు చేశారు పోలీసులు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐవీఆర్ (Interactive Voice Response)అనే సాంకేతిక సాయంతో సైబర్ నేరగాళ్లు ఓ మహిళకు కాల్ చేశారు. స్విగ్గీ అధికారులమనీ, మీ ఖాతా హ్యాక్ అయ్యిందని మాయమాటలు చెప్తున్నట్లు వెల్లడించారు. అకౌంట్‌ను యాక్సెస్‌ చేయడానికి అపరిచితులు ప్రయత్నిస్తున్నారని నేరస్తులు ఆ మహిళను నమ్మించినట్లు తెలిపారు.


ఖాతాను రక్షించడానికి మరికొంత సమాచారం తెలపాల్సి ఉంటుందన్నారన్నారు. నిజంగానే తన అకౌంట్‌ ప్రమాదంలో పడిందేమోనని నమ్మిన మహిళ వెంటనే తన యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ వంటి వ్యక్తిగత వివరాలు వారికి తెలిపిందని వెల్లడించారు. అంతే తన ఖాతా నుంచి రూ.97వేలు మాయమయ్యాయని పోలీసులు తెలిపారు.

డబ్బులు తన అకౌంట్ నుంచి పోయిన విషయం తెలుసుకున్నబాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాది చేసింది. స్విగ్గీ అకౌంట్‌కు లింక్‌ చేసిన అకౌంట్ నుంచి డబ్బులు పోయాయని తెలిపింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురుగ్రామ్‌కు చెందిన అనికేత్ కల్రా (25), హిమాన్షు కుమార్ (23) దోషులుగా గుర్తించి తక్షణమే అరెస్టు చేశారు. వీరిలో కల్రా అనే వ్యక్తి ఇంతకుముందు స్విగ్గీ, జొమాటోలో డెలివరీ బాయ్‌గా పని చేశాడని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కిరాణా వస్తువుల్ని తక్కువ ధరలకు కొని లాభం కోసం తిరిగి విక్రయించేవాడని తెలిసింది. ఇలా ఆన్‌లైన్‌ ఆర్డర్లు చేసేవారి సమాచారం సేకరించి హిమాన్షుతో కలిసి డబ్బుల్ని దోచుకుంటున్నారనే విషయం పోలీసుల విచారణ లో బయటపడింది.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×