BigTV English

CM Revanth Reddy : దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ.. పెట్టుబడులపైనే ఫోకస్..

CM Revanth REddy : దావోస్‌ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అండ్‌ టీమ్‌ బిజీబిజీగా ఉంది. మన దేశానికి చెందిన బడా పారిశ్రామికవేత్తలతో పాటు విదేశీ వ్యాపారులను కలిసి తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కూడా వారికి అర్థమయ్యేలా చెబుతున్నారు.

CM Revanth Reddy : దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ.. పెట్టుబడులపైనే ఫోకస్..

CM Revanth Reddy : దావోస్‌ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అండ్‌ టీమ్‌ బిజీబిజీగా ఉంది. మన దేశానికి చెందిన బడా పారిశ్రామికవేత్తలతో పాటు విదేశీ వ్యాపారులను కలిసి తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కూడా వారికి అర్థమయ్యేలా చెబుతున్నారు.


మరోవైపు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్వర్యలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హైదరాబాద్​ లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా–2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. ఆరోగ్య సంరక్షణ, లైఫ్‌సైన్సెస్‌ రంగాల్లో సాంకేతిక వినియోగాన్ని అభివృద్ధి పరిచేందుకు సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దోహదపడనున్నది.

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహిస్తున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఒప్పందం కుదిరింది. డబ్ల్యూఈఎఫ్‌ ప్రెసిడెంట్‌ బోర్గే బ్రెండే బృందంతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చలు జరిపిన అనంతరం జాయింట్ స్టేట్ మెంట్ ఇచ్చారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం విశాల దృక్పథం, నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఇరువురి భాగస్వామ్యంతో ప్రజలకు ఆరోగ్యం, సాంకేతికత, మంచి జీవితం అందించాలనే లక్ష్యాలను వేగంగా అందుకోవచ్చు అన్నారు.


వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రెవల్యూషన్‌ నెట్‌వర్క్ ప్రపంచంలోని ఐదు ఖండాల్లో విస్తరించి ఉన్నది. హైదరాబాద్‌లో నెలకొల్పనున్న సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రపంచంలో 19వది. హెల్త్‌కేర్‌, లైఫ్‌సైన్సెస్‌ నేపథ్యంతో ఏర్పాటవుతున్న మొదటి కేంద్రం కూడా ఇదే. సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన, లాభాపేక్ష లేని సంస్థగా పేరొందింది.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×