E-Paper
Advertisement

CM Revanth Reddy : తెలంగాణలో పోలీస్‌ ప్రక్షాళన షురూ.. జిల్లా ఎస్పీలను మార్చే యోచనలో సర్కార్..

CM Revanth Reddy : తెలంగాణలో పోలీస్‌ ప్రక్షాళన షురూ.. జిల్లా ఎస్పీలను మార్చే యోచనలో సర్కార్..
Advertisement

CM Revanth Reddy : తెలంగాణలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు తర్వాత పోలీస్‌ ప్రక్షాళనపై ఫోకస్‌ పెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. కొత్త సర్కార్‌ మాదిరే.. కొత్త టీమ్‌తో రేవంత్‌ తన పాలన మార్క్‌ చూపించనున్నారు. ఈ మేరకు మార్పులు చేర్పులపై కసరత్తు చేపట్టిన ముఖ్యమంత్రి పోలీస్‌శాఖలో ప్రక్షాళనను ప్రారంభించారు. సిన్సీయారిటీకి పెద్ద పీట వేస్తూ తన జట్టులోకి తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగానే కీలక కమిషనరేట్లైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలను బదిలీ చేసింది సర్కార్‌. ఆ స్థానాల్లో హైదరాబాద్ సీపీగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే త్వరలో మరికొన్ని కమిషనరేట్లలోనూ సీపీలను, జిల్లా ఎస్పీలను మార్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

తెలంగాణ వచ్చాక మొదట ఏర్పడింది రాచకొండ కమిషనరేట్‌. బదలీల్లో భాగంగా రాచకొండ సీపీగా సుధీర్ బాబును నియమించింది. ప్రస్తుతం సుధీర్ బాబు హైదరాబాద్ ట్రాఫిక్ ఆడిషన్ సీపీగా విధులను నిర్వహిస్తున్నారు. గతంలో వరంగల్ సీపీగా, రాచకొండ జాయింట్ సీపీగా పని చేసిన అనుభవం ఉండడంతో సుధీర్ బాబుకు సీపీగా పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం.

అలాగే సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్రను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ.. నూతన సీపీగా అవినాష్ మహంతిని నియమించింది. హైదరాబాద్ సీపీగా ఆనంద్‌ తర్వాత సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సందీప్‌ శాండిల్యకు బాధ్యతలు అప్పగించారు. అయితే.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో శాండిల్యను యాంటీ నార్కోటిక్‌ బ్యూరో డైరెక్టర్‌గా బదిలి చేస్తూ.. హైదరాబాద్ నూతన సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమించింది సర్కార్‌.

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×