BigTV English

Telangana Vimochana Dinotsavam : ఢిల్లీ బంగ్లాదేశ్‌లో లేదు.. ఎన్నిసార్లైనా వెళ్తా: బీఆర్ఎస్‌‌కు సీఎం రేవంత్ కౌంటర్

Telangana Vimochana Dinotsavam : ఢిల్లీ బంగ్లాదేశ్‌లో లేదు.. ఎన్నిసార్లైనా వెళ్తా: బీఆర్ఎస్‌‌కు సీఎం రేవంత్ కౌంటర్

Telangana Vimochana Dinotsavam : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు సీఎస్ శాంతికుమారి, జీహెచ్ఎంసీ మేయర్, కాంగ్రెస్ నేతలు కూడా నివాళులు అర్పించారు. మరోవైపు పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్మారకం వద్ద కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటారు. హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైన రోజుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది నుంచి సెప్టెంబర్ 17ని ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ.. నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అంటూ కవి దాశరథి కృష్ణమాచార్య రాసిన కవిత్వాన్ని చదివి వినిపించారు. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజని పేర్కొన్నారు. విలీన దినోత్సవం, విలీన విమోచన దినోత్సవం అని చెప్పుకుంటూ వస్తున్నాం.. కానీ ఇక నుంచి ఈరోజుని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం మంచిదని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. ఇది తెలంగాణ ప్రజల విజయమని చెప్పారు.

సెప్టెంబర్ 17ని ఇది ఒక ప్రాంతం, ఒక కులం లేదా ఒక మతానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదని, రాజకీయ కోణంలో చూడటం అవివేకమన్నారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ బానిస సంకెళ్లు తెంచుకున్న చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైందన్నారు. నాలుగుకోట్ల ప్రజల పిడికిలి ఎప్పటికీ ఇలాగే ఉండాలని, పెత్తందారులపై, నియంతలపై ఈ పిడికిలి ఇలాగే ఉండాలన్నారు.


Also Read: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

గడిచిన పదేళ్ల పాలనలో తెలంగాణ మగ్గిపోయిందన్నారు. పీసీసీ చీఫ్ గా తాను బాధ్యతలు స్వీకరించినపుడు నియంతల పాలన నుంచి తెలంగాణను విడిపిస్తానని మాటిచ్చానని, గతేడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి.. మాట నిలబెట్టుకున్నామన్నారు. ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. అమరుల ఆశయాలు, యువత ఆకాంక్ష ఉండాలన్నారు. పదేళ్లలో విధ్వంసమైన తెలంగాణను సాంస్కృతికంగా, ఆర్థికంగా పునరుజ్జీవం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి, అస్థిత్వం అంటే తమ కుటుంబానిదేనని గత పాలకులు భావించి.. కుటుంబ పాలన చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను అర్థంచేసుకునే ఉద్దేశం వారికి లేదన్నారు. నిజాంని మట్టికరిపించిన చరిత్ర తెలంగాణకు ఉందన్న విషయాన్ని మరచి.. రాష్ట్ర ప్రజలు తమ దయా, దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటారని భ్రమించారని విమర్శించారు.

తాను ఢిల్లీ వెళ్తే కొందరు విమర్శలు చేస్తున్నారన్న సీఎం రేవంత్.. ఢిల్లీ బంగ్లాదేశ్ లో ఏమీ లేదని, మనదేశంలోనే ఉందన్నారు. ఫౌస్ హౌస్ లో ఉండే సీఎం ను కాదని, పనిచేసే సీఎం ను కాబట్టే.. ప్రజల కోసం కృషి చేస్తున్నానని కౌంటరిచ్చారు. కేంద్రానికి చెల్లిస్తున్న పన్నుల్లో వాటా తెచ్చుకోవడం మన హక్కు అని, హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తానన్నారు.

మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టామని గుర్తు చేసిన సీఎం.. ఈ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. అలాగే గద్దర్ పేరున సినిమా అవార్డులు ఇస్తామని పేర్కొన్నారు. లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ నేడు డ్రగ్స్ సిటీగా దిగజారడానికి కారణం గత పదేళ్ల పాలనేనని దుయ్యబట్టారు. నగరంలో పర్యావరణం పునరుజ్జీవం కోసమే హైడ్రాను ఏర్పాటు చేశామని, హైదరాబాద్ భవిష్యత్ కు హైడ్రానే గ్యారంటీ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Related News

Komatireddy Rajagopalreddy: హమ్మయ్య..! రాజగోపాల్ రెడ్డి ఇగో చల్లారినట్టేనా?

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Big Stories

×