BigTV English

NTR: మా అమ్మ కల నెరవేర్చాను.. ఎన్టీఆర్ ఎమోషనల్

NTR: మా అమ్మ కల నెరవేర్చాను.. ఎన్టీఆర్ ఎమోషనల్

NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు సినిమాలు అంటూ తిరిగే ఎన్టీఆర్.. కొద్దిగా సమయం చిక్కినా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లిపోతుంటాడు. ఇక  తాజాగా ఎన్ని పనులు ఉన్నా ఆపుకొని మరీ.. ఎన్టీఆర్, తనతల్లి చిరకాల కోరికను నెరవేర్చాడు.


ఎన్టీఆర్ తల్లి షాలిని ఎప్పటినుంచో తన స్వగ్రామంలో ఉన్న  ఉడిపి శ్రీకృష్ణ మ‌ఠాన్ని  దర్శించుకోవాలని కోరుకున్నారట. కానీ, ఎన్టీఆర్ ఆ కోరికను వాయిదా వేస్తూ వచ్చాడు. ఇక ఎట్టకేలకు ఈరోజు ఆ కోరికను నెరవేర్చాడు. కుటుంబంతో కలిసి ఎన్టీఆర్.. తల్లి స్వగ్రామం అయిన కుందాపురంలోని ఉడిపి శ్రీకృష్ణ మ‌ఠాన్ని సంద‌ర్శించారు.

ఎన్టీఆర్ తో పాటు.. అతని భార్య లక్ష్మీ ప్రణతి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కూడా పాల్గొన్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ.. ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యాడు. “నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది! దాన్ని సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు జరిగేలా చేయడం నేను ఆమెకు ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతిగా భావిస్తున్నాను.


విజయ్ కిరంగాదూర్  సార్ మరియు నా ప్రియమైన స్నేహితుడు ప్రశాంత్ నీల్.. నాతో చేరి దీన్ని సాధ్యం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా ప్రియమైన స్నేహితుడు రిషబ్ శెట్టికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.  వీరి ఉనికి మరియు మద్దతు ఈ క్షణాన్ని చాలా ప్రత్యేకంగా చేసింది” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇకపోతే ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది కాకుండా ఎన్టీఆర్ నటించిన దేవర రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాలతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×