E-Paper
Advertisement

Praja Darbar : సీఎం రేవంత్ ప్రజా దర్బార్‌.. తొలి రోజే భారీ స్పందన..‌

Praja Darbar : సీఎం రేవంత్ ప్రజా దర్బార్‌.. తొలి రోజే భారీ స్పందన..‌

Praja Darbar : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాట ప్రకారమే శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌ వద్దకు భారీగా ప్రజల తరలివచ్చారు. వారి నుంచి అర్జీలను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించారు. వినతిపత్రాలను సీఎం స్వీకరించి పరిశీలించారు. క్యూలైన్లలోకి వెళ్లి మరీ వారి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యల పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. వెంటనే ఆర్జీలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

ఇకపై ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒకవైపు సీఎం ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే మరోవైపు ప్రగతి భవన్ వద్ద ఆంక్షలను ఎత్తివేశారు. అక్కడ వేసిన ఇనుప కంచెలను తొలిగించారు. బారికేడ్లును తీసివేశారు. ఇక ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ సమస్యలను చెప్పుకోవచ్చని సీఎం తెలిపారు. అలాగే ప్రగతి భవన్ పేరు ప్రజాభవన్ గా మార్చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచే ప్రజల భారీగా క్యూకట్టారు. సీఎంను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.

ప్రజాభవన్‌ వద్ద హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు. ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకుని ఆ తర్వాత క్యూలైన్లలో లోపలికి అనుమతించారు.

Tags

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×