E-Paper
Advertisement

CM Public Meeting: సీఎం భారీ బహిరంగ సభ కోసం ముస్తాబు చేస్తున్న గ్రౌండ్స్..!

CM Public Meeting: సీఎం భారీ బహిరంగ సభ కోసం ముస్తాబు చేస్తున్న గ్రౌండ్స్..!
Advertisement

CM Public Meeting: స్వేఛ్చ బ్యూరో: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధి గూడూరు శివారులో గురువారం జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బహిరంగ సభను సక్సెస్ చేయాలని సీఎం బహిరంగ సభ ప్రోగ్రాం ఇంచార్జ్, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పార్టీ శ్రేణులను, ప్రజలను కోరారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్న సభకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలన అనంతరం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్, తెలంగాణ టూరిజం శాఖ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సభకు రూరల్ ఏరియా నుంచి సుమారు 30 నుంచి 35 వేల మంది హాజరుకానున్నట్లు చెప్పారు. సుమారు 1000 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. దామరచర్ల, అడవిదేవులపల్లి ఏరియాలో అవసరమైన అభివృద్ధికి సీఎం ఎదుట ప్రతిపాదనలు ఉంచనున్నట్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తెలిపారు.

ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత

మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో సభా ప్రాంగణం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, వీఐపీ పార్కింగ్, పబ్లిక్ పార్కింగ్ ప్రాంతాలు, రాకపోకల మార్గాలను స్వయంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనలో భాగంగా బందోబస్తు నిర్వహణకు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 130 మంది ఎస్సైలు ఇతర పోలీస్ సిబ్బందితో కలిపి మొత్తం సుమారు 1500 మంది పోలీస్ బలగాన్ని నియమించినట్లు తెలిపారు.

Advertisement

Also Read: Takshakudu Teaser: చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాట… ఆసక్తికరంగా తక్షకుడు టీజర్ రిలీజ్!

వేదిక వరకు కట్టుదిట్టమైన భద్రత

హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్ ద్వారా పబ్లిక్ మీటింగ్ వేదికకు చేరుకునే వరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ రోడ్ ఓపెనింగ్ పార్టీలు, రూఫ్ టాప్ సెంట్రీలు, పెట్రోలింగ్ టీములు, పికెటింగ్, ట్రాఫిక్ డైవర్షన్, బాంబ్ స్క్వాడ్ & డాగ్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీములు, పార్కింగ్ బందోబస్తు వంటి ఏర్పాట్లు చేపట్టి, మొత్తం ప్రాంతాన్ని సెక్టార్లుగా విభజించి ఆయా సెక్టార్లకు డీఎస్పీలను ఇన్‌చార్జీలుగా నియమించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పబ్లిక్ మీటింగ్‌కు హాజరయ్యే ప్రజలకు, వీఐపీలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను. కేటాయించి, రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రవేశ మార్గాలు, నిష్క్రమణ మార్గాలను సక్రమంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ సూచనలు చేస్తూ, ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండి, విధులు నిర్వర్తించే సమయంలో సంయమనం పాటించాలని, సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పార్కింగ్ మరియు ట్రాఫిక్ డైవర్షన్ విధుల్లో ఉన్న సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా చూడాలని, సభ పూర్తయ్యే వరకు నిరంతరంగా పటిష్ట భద్రత కల్పించాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా శాంతియుతంగానిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ వెల్లడించారు.

Advertisement

Also Read: Manakondur Granite Quarry: మానకొండూర్‌లో ‘షాడో’ రాజకీయం.. మంత్రి పేరిట ఫేక్ లెటర్.. గ్రానైట్ క్వారీపై కన్ను!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×