BigTV English

CM Revanth Reddy : ముగిసిన విదేశీ పర్యటన.. హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy : దావోస్‌, లండన్‌, దుబాయ్‌లో మూడ్రోజుల పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ చేరుకుంది. ఈనెల 15న దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం.. తర్వాత లండన్‌, దుబాయ్‌లో పర్యటించారు.

CM Revanth Reddy : ముగిసిన విదేశీ పర్యటన.. హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
Political news today telangana

CM Revanth Reddy latest news(Political news today telangana):

దావోస్‌, లండన్‌, దుబాయ్‌లో మూడ్రోజుల పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ చేరుకుంది. ఈనెల 15న దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం.. తర్వాత లండన్‌, దుబాయ్‌లో పర్యటించారు.


విదేశీ పర్యటనలో భాగంగా లండన్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బృందం దుబాయ్ వెళ్లింది. మూసీ అభివృద్ది ప్రణాళికలపై అంతర్జాతీయ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి సంస్థలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. మూసీ అభివృద్ధి కోసం లండన్​లోని థేమ్స్ నదిని అధ్యయనం చేసి రేవంత్ రెడ్డి బృందం, దుబాయ్‌లో నిపుణులతో చర్చించింది. సుమారు 54 కిలోమీటర్ల మూసీ పరీవాహకం అభివృద్ధి, సుందరీకరణతో పాటు వాణిజ్య అవకాశాలపై చర్చించారు.

పట్టణాభివృద్ధి, మాస్టర్ ప్లాన్, సిటీ స్పేస్ అభివృద్ధిలో అనుభవమున్న సుమారు 70 గ్లోబల్ సంస్థలతో సీఎం రేవంత్​ బృందం చర్చించింది. ఆయా సంస్థలు వివిధ దేశాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించాయి. పలు ప్రముఖ సంస్థలు మూసీ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తిని కనబరిచాయి. అవసరమైతే హైదరాబాద్ వచ్చి మూసీ పరిసరాలు పరిశీలించి తదుపరి చర్చలు చేపడతామని తెలిపాయి. సీఎంతో పాటు ఉన్నతాధికారులు శేషాద్రి, అజిత్ రెడ్డి, దాన కిషోర్, ఆమ్రపాలి కూడా హైదరాబాద్‌ చేరుకున్నారు.


Tags

Related News

Ramreddy Damodar Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఇక లేరు

Kavitha: లక్ష మందితో బతుకమ్మ పండుగ చేసి చూపిస్తా.. కవిత కీలక వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వానలు, బయటకు వెళ్తే అంతే సంగతులు..!

Telangana Politics: అనిరుధ్ రెడ్డి vs కేటీఆర్, ప్రతీది రాజకీయమే.. స్వేచ్ఛ మీ దగ్గరెక్కడ?

Telangana politics: మొదలైన స్థానిక ఎన్నికల వేడి.. సీఎం రేవంత్ కీలక భేటీ, ఏడున అభ్యర్థుల ప్రకటన

Minister Uttam: తెలంగాణలో ఈసారి రికార్డ్ స్థాయిలో ధాన్యం ఉత్పత్తి.. దేశంలో మరోసారి అత్యధికంగా..?

Weather News: ఈ జిల్లాల్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్, ఈ టైంలో బయటకు వెళ్లొద్దు

Free Bus Ticket: డీలక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వలేదని.. బస్సు కింద పడుకుని మహిళ హల్ చల్

Big Stories

×