CM Revanth Reddy : ఆ సీన్ అందరికీ గుర్తే ఉండిఉంటుంది. రేవంత్‌రెడ్డి సీఎం అయిన కొత్తలో జరిగిందా ఘటన. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ జరిగితే.. హాస్పిటల్‌కి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఆ సమయంలో రేవంతన్నా.. రేవంతన్నా.. అంటూ ఓ మహిళ ఆర్తిగా పిలిచారు. పిలుపు విన్న వెంటనే సీఎం రేవంత్ ఆ మహిళ దగ్గరకు వచ్చి ఏంటి సమస్య అని అడిగారు. తన కుటుంబ సభ్యులకు ఇదే ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని.. సరిపడా డబ్బులు లేవని.. సాయం చేయమని అడిగింది. వెంటనే ఆమెకు కావాల్సిన ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఆ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. శెభాష్ సీఎం అంటూ రేవంత్‌కు అనేక ప్రశంసలు వచ్చాయి. కట్ చేస్తే.. లేటెస్ట్‌గా అలాంటిదే మరో ఉదంతం చోటుచేసుకుంది. ఈసారి సీఎంను ఎవరూ అడగకపోయినా.. విషయం తెలిసి ఆయనే స్వయంగా స్పందించారు. మరోసారి తన మానవత్వాన్ని ప్రదర్శించారు.
అసలేం జరిగిందంటే..
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నందికొండకు చెందిన సిద్ద్వంతి అనే మహిళ బాధ ఇది. రెండున్నరేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఇద్దరు కూతుర్లను తనే సాకుతోంది. రెండేళ్ల క్రితం చిన్న కూతురు హారిక ఇంటిముందు ఆడుకుంటుండగా.. వీధి కుక్కలు దాడి చేసి కరిచాయి. నాగార్జున సాగర్‌లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. ట్రీట్‌మెంట్ చేసి కుక్కకాటు టీకా వేశారు. అయితే, సెకండ్ డోస్ టీకా వేసే సరికి అది వికటించింది. తీవ్ర జ్వరం రావడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే హారిక కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోయాయి. కోమాలోకి వెళ్లిపోయిందా చిన్నారి. ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స చేయించినా ఫలితం రాలేదు. భర్త లేక.. కూతురికి చికిత్స చేయించలేక.. ఆ తల్లి పడుతున్న బాధపై.. ఓ న్యూస్ పేపర్‌లో వార్త వచ్చింది. అమ్మా అనలేదు.. ఆకలేసినా చెప్పలేదు.. అంటూ ప్రభుత్వమే తనను ఆదుకోవాలని.. కూతురు చికిత్సకు సహకరించాలని సిద్ద్వంతి వేడుకుంది.
Also Read : లోకేశ్‌ను ఫాలో అవుతున్న కవితక్క.. ఏంటి సంగతి?
సీఎం రేవంత్ రియాక్షన్
కట్ చేస్తే.. ఆ పేపర్ క్లిప్ సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వచ్చింది. ఆమె కష్టానికి చలించిపోయారు. వెంటనే చిన్నారి హారిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అధికారులను పంపించి.. హారికకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ విషయం స్వయంగా ఆయనే తన ఎక్స్ ఖాతాలో తెలిపారు.
చిన్నారి హారిక ఆరోగ్య పరిస్థితి గురించి
ఆరా తీయడం జరిగింది.నా ఆదేశాల మేరకు …
చిన్నారి తాత కొమ్ము రాందాసు గారితో
మా అధికారులు స్వయంగా మాట్లాడారు.హారికకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా
ఆదుకోవడానికి ఉన్న అవకాశాలను… pic.twitter.com/fVk1GejOWU— Revanth Reddy (@revanth_anumula) April 17, 2025