BigTV English
Advertisement

BRS : ఐ వన్నా ఫాలో ఫాలో ఫాలో యూ…

BRS : ఐ వన్నా ఫాలో ఫాలో ఫాలో యూ…

BRS : రెడ్ బుక్. ఏపీ రాజకీయాలను మార్చేసిన డైలాగ్. ప్రతిపక్షంలో ఉండగా రెడ్ బుక్ నినాదమే లోకేశ్‌ చేతిలో ఆయుధమైంది. కార్యకర్తల్లో ధైర్యం నింపింది. పోలీసుల్లో భయం పుట్టించింది. ఏదో డైలాగే కదాని తీసి పారేయడానికి లేదు. పవర్‌లోకి వచ్చాక.. అదే రెడ్ బుక్ పవర్‌ఫుల్ వెపన్‌గా మారింది. ఆనాడు నోరేసుకుని విరుచుకుపడిన నేతలను జైల్లో పెడుతోంది. ఆ బుక్‌లో ఉన్న వాళ్లను కంగారు పెడుతోంది. అందుకే, ఏపీ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్‌గా నిలిచింది ఈ రెడ్ బుక్ డైలాగ్.


లోకేశ్‌ను కవిత ఫాలో అవుతున్నారా?

సేమ్ టు సేమ్.. తెలంగాణలో పింక్ బుక్ నినాదం ఎత్తుకున్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే వారి పేర్లు అందులో రాస్తానని హెచ్చరిస్తున్నారు. గులాబీ కేడర్‌ను బెదిరించి.. కేసులతో ఇబ్బంది పెట్టే ఎవ్వరినీ క్షమించే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. దాడులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నేతలు.. వారికి అనుకూలంగా పని చేస్తున్న అధికారుల పేర్లు పింక్‌ బుక్‌లో రాసుకుంటామని.. తమ ప్రభుత్వం వచ్చాక వారి సంగతి చూస్తామని అంటున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంతమంది ఫోన్లు చేసి తమ కార్యకర్తలను బెదిరిస్తున్నట్టు తెలిసిందని కవిత అన్నారు.


కవిత.. రౌడీ టైప్ అట..

కేసీఆర్ మంచోడే అని.. తాను మాత్రం కాస్త రౌడీ టైప్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు కవిత. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడమని తేల్చి చెప్పారు. వాళ్ల తాతలు, ముత్తాతలు, జేజమ్మలు దిగొచ్చినా.. ఇక్కడ భయపడేవాళ్లెవరూ లేరంటూ కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో కవిత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఏపీలో సీన్ వేరమ్మా..

ఏపీకి, తెలంగాణకి చాలా తేడా ఉంది. ఎన్నికలకు ఏడాది ముందు లోకేశ్ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పటికే నాలుగేళ్ల జగన్ పాలనతో మెజారిటీ వర్గం విసిగిపోయారని అంటారు. వైసీపీ నేతల అరాచకాలు, కబ్జాలు, దాడులతో జనం ఇబ్బందుల్లో ఉన్నారని చెబుతారు. కొడాలి, వంశీ, అంబటి, పేర్ని, రోజా, జోగి, పోసాని లాంటి నేతల మాటలు, తిట్లు, బూతులను ఏపీలోని మెజార్టీ వర్గం ఆమోదించలేకపోయింది. వారికి వంత పాడే.. సునీల్ కుమార్, సీతారామాంజనేయులు లాంటి పోలీస్ అధికారులపై బాగా వ్యతిరేకత వచ్చిందంటారు. సరిగ్గా అదే సమయంలో.. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేపట్టడం.. నేరుగా ప్రజల్లోకి వెళ్లడం.. రెడ్ బుక్ డైలాగ్‌తో కేడర్‌లో కాన్ఫిడెన్స్ నింపడంతో.. అది బాగా వర్కవుట్ అయింది. కానీ, తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు.

Also Read : కూల్చేస్తారా? రేవంత్‌ను టచ్ చేసి చూడు..

పింక్ బుక్‌తో పనేంటి?

రేవంత్ పాలన ఏడాది దాటిందంటే. ఇచ్చిన హామీలు వరుసగా అమలు చేస్తూ వస్తున్నారు. ప్రజా పాలన బాగుందనే జనాలు కితాబు ఇస్తున్నారు. అధికార దర్పం ఎక్కడా కనబడుట లేదు. సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రతీకార దాడులు గట్రా లేనే లేవు. శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. ఇక, పింక్ బుక్‌తో పనేముంది? ఏపీలో మాదిరి పరిస్థితులు తెలంగాణలో లేవుగా? అని కవితను సోషల్ మీడియాలో కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. పింక్ బుక్ అనేది.. ఏదో పంచ్ డైలాగ్‌కి పనికొస్తుంది కానీ.. దాంతో రాజకీయ పబ్బం గడుపుకోవడం అంత ఈజీ కాదంటున్నారు.

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Big Stories

×