Shah Rukh Khan : బాలీవుడ్ బాద్షా గౌరీ ఖాన్ (Gauri Khan) ముంబైలో టోరి (Torii Restaurent) అనే ఒక పాష్ రెస్టారెంట్ నడుపుతున్నారు. అయితే ఓ యూట్యూబర్ ఈ రెస్టారెంట్ లో వాడుతున్న పన్నీర్ ఫేక్ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను వదిలాడు. అది కాస్తా వైరల్ కావడంతో రెస్టారెంట్ యాజమాన్యం స్పందిస్తూ తమను తాము సమర్ధించుకుంది. కానీ యూట్యూబర్ వాళ్ల సమాధానంపై సెటైర్లు వేస్తూ రిప్లై ఇవ్వడం నెట్టింట చర్చకు దారి తీసింది.
షారూఖ్ రెస్టారెంట్లో ఫేక్ పన్నీర్
యూట్యూబర్ సార్ధక్ సచ్ దేవ్ ముంబైలోని సెలబ్రిటీల రెస్టారెంట్లలో ఫుడ్ క్వాలిటీని తరచుగా చెక్ చేస్తూ ఉంటాడు. అందులో ఏ రెస్టారెంట్లలో క్వాలిటీ పన్నీర్ ను అమ్ముతున్నారు? ఏ రెస్టారెంట్లు చౌకైన లేదా ఫేక్ పన్నీర్ ను ఉపయోగిస్తున్నారు వంటి విషయాలను సైంటిఫిక్ గా ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
అందులో భాగంగా ఇప్పటిదాకా అతను విరాట్ కోహ్లీ వన్ 8 కమ్యూన్, శిల్పా శెట్టి బాస్టియన్, బాబీ డియోల్ సమ్‌ప్లేస్ ఎల్స్ వంటి రెస్టారెంట్లను సందర్శించాడు. అక్కడ పన్నీర్ ను ఆర్డర్ చేసి, అయోడిన్ తో టెస్ట్ చేశాడు. అయితే ఈ రెస్టారెంట్లలో పన్నీర్ బాగానే ఉంది. కానీ ఇదే విధంగా అతను గౌరీ ఖాన్ రెస్టారెంట్ టోరీకి వెళ్లి టెస్ట్ చేయగా, అక్కడ పన్నీర్ ఫేక్ అని తేలింది. అయోడిన్ టెస్ట్ లో పన్నీర్ నల్లగా మారడంతో సార్థక్ “షారూఖ్ రెస్టారెంట్ నకిలీ పన్నీర్ అమ్ముతోంది. ఇది చూసి నా మైండ్ బ్లాక్ అయింది” అంటూ ఓ వీడియోను షేర్ చేశాడు.
టోరీ రెస్టారెంట్ యాజమాన్యం రియాక్షన్
దీంతో స్టోరీ రెస్టారెంట్ పై నెటిజెన్లు ట్రోలింగ్ తో విరుచుకుపడ్డారు. చూడడానికే పాష్ రెస్టారెంట్, చేసేవన్నీ చిల్లర పనులు అంటూ కామెంట్స్ చేశారు. ఈ విషయంపై రెస్టారెంట్ యాజమాన్యం స్పందిస్తూ “పనీర్ క్వాలిటీని అయోడిన్ పరీక్షతో తేల్చలేము. ఎందుకంటే ఇది అందులో స్టార్చ్ ఉందో లేదో మాత్రమే వెల్లడిస్తుంది. ఇక మా వంటకాలలో సోయా ఆధారిత పదార్థాలు ఉంటాయి. కాబట్టి అయోడిన్ వేస్తే కచ్చితంగా కలర్ మారుతుంది. టోరీ లోని ఫుడ్, పనీర్ క్వాలిటీగా ఉండడానికే మేము ఇంపార్టెన్స్ ఇస్తాము” అంటూ తమను తాము సమర్థించుకున్నారు. దీంతో వెంటనే సార్ధక్ స్పందిస్తూ “సరే ఇప్పుడు నన్ను బ్యాన్ చేస్తారా? మీ ఆహారం అద్భుతంగా ఉంది” అంటూ చమత్కరించాడు.
Read Also : బాలీవుడ్ లో తెలుగు డైరెక్టర్ హవా… 100 కోట్లే లక్ష్యంగా…
పన్నీర్ కి ఈ అయోడిన్ టెస్ట్ ఏంటి?
ఆహారంలో లేదా పన్నీర్ లో స్టార్చ్ ఉందా లేదా అనే విషయాన్ని గుర్తించడానికి అయోడిన్ పరీక్షను ఉపయోగిస్తారు. స్టార్చ్ ఉంటే అది వెంటనే ముదురు నీలం లేదా నలుపు రంగులోకి మారుతుంది. నిజానికి స్వచ్ఛమైన పనీర్ పాల నుంచి తయారవుతుంది. కాబట్టి సహజంగా ఇందులో స్టార్చ్ ఉండదు. ఒకవేళ అయోడిన్ వేయగానే పన్నీర్ కలర్ మారింది అంటే అది సింథటిక్ లేదా కల్తీ పన్నీర్ అన్నమాట. ఇప్పుడు షారుక్ ఖాన్ రెస్టారెంట్ టోరీలో ఈ టెస్ట్ లోని పన్నీర్ ఫేక్ అని తేలింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">