Sampath Nandi : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో సంపత్ నంది ఒకరు. దర్శకుడుగా రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఎట్టకేలకు అవకాశం దక్కింది. అయితే రామ్ చరణ్ అప్పటికే స్టార్ ఇమేజ్ తో ఉండడంతో ముందు ఏదైనా ఒక చిన్న సినిమాను చేసుకొని రమ్మని చెప్పారు. ఆ తరుణంలో సంపత్ నంది వరుణ్ సందేశ్ హీరోగా ఏమైంది ఈవేళ అనే సినిమాను చేశాడు. ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు మంచి ఆదరణ సాధించాయి. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా రచ్చ అనే సినిమాను చేశాడు సంపత్ నంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది.
బాక్సాఫీస్ వద్ద రచ్చ
మగధీర సినిమాతో రామ్ చరణ్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆరెంజ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత సంపత్ నంది డైరెక్షన్ లో రచ్చ సినిమాను చేశాడు చరణ్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. తమన్ చరణ్ కెరీర్ కి కూడా మంచి ప్లస్ అయింది. ఈ సినిమాతో మళ్ళీ రామ్ చరణ్ కం బ్యాక్ అయ్యాడు అని చెప్పాలి. ఈ సినిమాలో రామ్ చరణ్ ని చూపించిన విధానం చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంది. కొన్నిచోట్ల మెగాస్టార్ చిరంజీవిలా కూడా చరణ్ ఈ సినిమాలో కనిపిస్తాడు. పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమాను డిజైన్ చేసుకున్నాడు సంపత్ నంది. ఈ సినిమా తర్వాత మళ్లీ స్టార్ హీరోతో పని చేయలేదు.
నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ
రీసెంట్ టైమ్స్ లో వస్తున్న లవ్ స్టోరీస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యూత్ బేస్డ్ సినిమాలు రీసెంట్ టైమ్స్ లో రావడం ఆగిపోయాయి. బేబీ , కోర్టు లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధిస్తున్నాయి. ఇ తరుణంలో అటువంటి తరహా కథను సిద్ధం చేశా అంటూ సంపత్ నంది చెప్పుకొచ్చాడు. నిబ్బా నిబ్బి అనే టైటిల్ తో ఒక ప్రేమ కథను చేయబోతున్నట్లు తెలిపాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ కూడా సంపత్ నంది రిజిస్టర్ చేశారట. ఇక ఈ సినిమాను త్వరలో తీయబోతున్నట్లు తెలిపాడు. సంపత్ నంది కదా స్క్రీన్ ప్లే అందించిన ఓదెల సినిమా నేడు బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఇంకో రెండు రోజుల్లో ఈ సినిమా తుది పరితమైందో ప్రేక్షకులకు అర్థం కానుంది.
Also Read : Sundar C : తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మూడు రకాల దర్శకులు ఉన్నారు