CM Revanth Reddy : ఎన్నికల ప్రచారంలో అప్పటి సీఎం కేసీఆర్ పదే పదే ఓ ఆరోపణ చేసేవారు. కాంగ్రెసోళ్లకు పాలన చేతకాదు.. వాళ్లొస్తే మళ్లీ కరెంట్ కోతలు వస్తాయని.. తెలంగాణను చీకట్లు కమ్ముకుంటాయని.. ఓటర్లను బాగా భయపెట్టారు. తానే గొప్ప అనేలా స్పీచ్‌లు దంచేవారు. అయితే, కేసీఆర్ చెప్పిన కాకమ్మ కబుర్లను జనం నమ్మలేదు. బీఆర్ఎస్‌ను బండకేసి కొట్టారు. కాంగ్రెస్‌ను గెలిపించారు. సీఎంగా రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌ను తలదన్నేలా పాలన కొనసాగిస్తున్నారు. గడిచిన ఏడాదిన్నరలో ఒక్క క్షణమైనా కరెంట్ పోయింది లేదు. కేసీఆర్ చెప్పినట్టు పవర్ కట్స్ లేవు, రాష్ట్రంలో చీకట్లు అలుముకోలేదు. సమ్మర్‌లో విద్యుత్ డిమాండ్ పీక్స్‌కు చేరిన సమయంలోనూ తెలంగాణలో కరెంట్ కోతలు లేకపోవడం ముఖ్యమంత్రిగా రేవంత్ పని తీరుకు నిదర్శనం.
విద్యుత్ డిమాండ్ పీక్స్
లేటెస్ట్‌గా, విద్యుత్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 17,162 మెగావాట్లకు చేరుకుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే 9.8 శాతం డిమాండ్ పెరిగింది. 2025-26లో 18,138 మెగావాట్లకు చేరుకుంటుందని చెప్పారు. డిమాండ్ పెరిగినా ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోంది తెలంగాణ సర్కారు.
ఫ్యూచర్ ప్లాన్స్
వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. రైల్వే లైన్లు, మెట్రో తదితర విద్యుత్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర కార్పొరేషన్లకు, కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామికవాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశ్యం చేశారు ముఖ్యమంత్రి.
Also Read : కొండాతో అంత కాంట్రవర్సీ ఎందుకు?
అండర్‌గ్రౌండ్ కరెంట్ కేబుల్స్
ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రెడీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్‌లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. GHMC పరిధిలోని ఫుట్‌పాత్‌లు, నాలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు.
పవర్ ఫుల్ స్టేట్
డేటా సిటీ ఏర్పాటుతో భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్‌గా మారబోతుందన్నారు సీఎం రేవంత్. రీజనల్ రింగ్‌రోడ్డు పరిధిలో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్‌షిప్‌లకు కావాల్సిన విద్యుత్ వినియోగంపై HMDAతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. డిమాండ్‌కు తగ్గట్టు సబ్‌స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని.. విద్యుత్ లైన్ల ఆధునీకరణపై కూడా ఫోకస్ చేయాలని సమీక్షలో అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.