ORS Benefits: దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న వేడి, వడగాలులు మన ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది, దీనివల్ల వడదెబ్బ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ప్రజలందరూ వేడి, దాని వల్ల కలిగే సమస్యల గురించి జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ స్థాయి ఉష్ణోగ్రత పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు అంటున్నారు. కాబట్టి ఈ వ్యక్తులు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
వేడి నుండి రక్షించుకోవడానికి.. ఆరోగ్య నిపుణులు ప్రతి ఒక్కరూ రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలని చెబుతుంటారు. దీంతో పాటు.. శరీరంలో ఎలక్ట్రోలైట్ల లోపాన్ని భర్తీ చేయడానికి కొబ్బరి నీళ్లు, ఇతర ప్రయోజనకరమైన డ్రింక్స్ కూడా తీసుకోవడం మంచిది.
వేసవిలో ORS తాగడం గురించి చాలా చర్చ జరుగుతోంది. ఇంతకీ ORS అంటే ఏమిటి ? దాని ప్రయోజనాలు ఏమిటి ? ORS తాగడానికి సరైన సమయం ఏంటనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ORS అంటే ఏమిటో తెలుసుకోండి ?
ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) అనేది శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి లేదా డీహైడ్రేషన్‌ను నివారించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన డ్రింక్ అని చెప్పొచ్చు. సమ్మర్‌లో జీర్ణ సమస్యలు, విరేచనాలు , వాంతుల వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.ఫలితంగా డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ల లోపానికి కూడా కారణమవుతాయి. అటువంటి పరిస్థితిలో.. ఆరోగ్య నిపుణులు మీకు ORS ద్రావణాన్ని తాగమని సలహా ఇస్తుంటారు.
ORS ప్రధానంగా చక్కెర, సోడియం, పొటాషియంల మిశ్రమం. ఇది శరీరంలోని అనారోగ్యం లేదా నీటి-ఎలక్ట్రోలైట్ల లోపాన్ని అధిగమించడంలో మీకు ఉపయోగకరంగా ఉంటుంది.
ORS ఎప్పుడు తాగాలి ?
శరీరంలో నీటి కొరతను అధిగమించడానికి ORS మంచి , ప్రభావవంతమైన పరిష్కారం అయినప్పటికీ.. ఇది ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. కేవడం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు మాత్రము తాగాలి.
శరీరంలో నీటి కొరతను ఎలా అధిగమించాలి ?
ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ శరీరంలో విరేచనాలు, నీటి నష్టాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అన్ని వయసుల వారికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పిల్లలలో విరేచనాలు , నిర్జలీకరణ చికిత్సకు ఇది సహాయపడుతుంది. పెద్దల కంటే పిల్లలలో అతిసారం కారణంగా నిర్జలీకరణం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఇది పిల్లలలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది.
Also Read: మొలకెత్తిన వేరుశనగ తింటే.. ఆశ్చర్యకర లాభాలు !
కానీ ఓఆర్ఎస్ తాగేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్య నిపుణులు చెప్పేదేటంటే.. ముఖ్యంగా మీరు డీహైడ్రేషన్‌ను ఎదుర్కొంటుంటే.. డీహైడ్రేషన్‌ను తగ్గించడానికి ORS రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తీసుకోవచ్చు.
ద్రావణాన్ని సరిగ్గా తయారు చేయకపోతే అది ఉప్పు పెరుగుదలకు దారితీస్తుంది. ఈ పరిస్థితిలో.. వికారం, వాంతులు, బలహీనత, ఆకలి లేకపోవడం, వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
తేలికపాటి నిర్జలీకరణాన్ని తగ్గించడానికి ORS మంచి మార్గం కావచ్చు.. అయితే దీని నుండి మీకు ఉపశమనం లభించకపోతే డాక్టర్‌ను సంప్రదించండి. చాలా కాలం పాటు కొనసాగే డీహైడ్రేషన్ పరిస్థితి కూడా అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.