BigTV English

Madhumani : మధుమణి ఆవేదన.. సమంతతో ఆ సినిమా ఛాన్స్ మిస్సయింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..

Madhumani : మధుమణి ఆవేదన..  సమంతతో ఆ సినిమా ఛాన్స్ మిస్సయింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..

Madhumani: సినీ ఇండస్ట్రీలో అమ్మ సెంటిమెంట్ తో వచ్చే సినిమాలు నో సక్సెస్ ని అందుకున్నాయి. ఎంతోమంది అమ్మ క్యారెక్టర్ లో నటించి మెప్పించిన ఆర్టిస్టులు ఉన్నారు. తల్లి క్యారెక్టర్ కి పెట్టింది పేరు మధుమణి. నాని అష్టా చెమ్మ మూవీలో, నానికి తల్లిగా నటించి పాపులర్ అయ్యారు. ఇటీవల ఆమె నటించిన శుభం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని అందుకుంది. తాజాగా ఈ మూవీ టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. అందులో భాగంగా మధుమణి, సమంత గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ వివరాలు చూద్దాం..


సమంతతో ఆ సినిమా ఛాన్స్ మిస్సయింది..

బుల్లితెర సూపర్ హిట్ సీరియల్ ఋతురాగాలతో తో, అందరికి పరిచయం అయిన నటి మధుమణి.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో నటించారు. ఎంతోమంది తెలుగు హీరో హీరోయిన్లకు, తల్లిగా నటించి మెప్పించారు. నాని అష్టా చమ్మా మూవీలో హీరోకి తల్లి క్యారెక్టర్ లో నటించి పాపులర్ అయ్యారు. ప్రస్తుతం శుభం మూవీలో నటించారు. ఈ మూవీ సక్సెస్ మీట్ లో మధుమణి మాట్లాడుతూ.. నేను ఇప్పటికే ఎంతో మంది హీరో హీరోయిన్స్ తో, తల్లి క్యారెక్టర్ లో చేశాను. 400కు పైగా సినిమాల్లో నటించాను. కానీ, ఇప్పటికీ నాకు ఒక లోటు ఉంది. అదే సమంతతో తల్లి క్యారెక్టర్ చేయలేకపోవడం, నిజంగా నేనెప్పుడూ ఈ విషయానికి బాధపడుతూ ఉంటాను. సమంతతో రంగస్థలం మూవీ లో యాక్ట్ చేయాల్సిన అవకాశాన్ని మిస్ అయ్యాను. అప్పటినుంచి ఆమెను ఒకసారి చూస్తానా, లేదా అసలు కలుస్తానా, అని అనుకున్నాను. కానీ ఆవిడ నిర్మాతగా చేస్తున్న మొదటి సినిమాలోనే నాకు అవకాశం రావడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలోకి నన్ను తీసుకువచ్చిన ప్రొడక్షన్ టీం ఆర్యకు స్పెషల్ గా థాంక్స్ చెప్పాలి. ఇక సమంత నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. ఈ మూవీ లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక్కరోజు షూటింగ్ తర్వాత నాకు హెల్త్ బాగోలేదు. ఆవిడే దగ్గరుండి నాకు జాగ్రత్తలు చెప్పి, నాకు తగ్గే వరకు హాస్పిటల్ కి సంబంధించిన అన్ని విషయాలు చూసుకున్నారు. షూటింగ్ సమయంలో ఆమె ఎంతో పర్సనల్ కేర్ తీసుకొని, అందరి ఆర్టిస్టులని చూసుకున్నారు. ఇప్పటికీ నాకు ఆవిడతో నటించలేదని బాధగా అనిపిస్తుంది. ఎప్పటికైనా అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తాను అని మధు అని తెలిపింది. అయితే వీరిద్దరు ఒక యాడ్ షూట్ కోసం నటిస్తున్నడటం విశేషం..


సమంత మొదటి ప్రయత్నం సక్సెస్ ..

ఇక శుభం మే 9న ప్రేక్షకులు ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సమంత తొలి ప్రయత్నం సక్సెస్ అయినందుకు ఆవిడతో, పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి లో ఉన్నారు. సమంత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, ఈ సినిమా మీరు చూస్తే ఖచ్చితంగా నచ్చితే తీరుతుంది అని చెప్పడం. డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమా గురించి ఎమోషనల్ గా మాట్లాడడం మనం చూసాం ఇప్పుడు అదే నిజమై, సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతుంది. ఇప్పటికీ మూవీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో, దూసుకుపోతోంది సమంత పెట్టిన పెట్టుబడికి డబల్ కలెక్షన్స్ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 300 స్క్రీన్ లకు పైగా వరల్డ్ వైస్ గా 500 స్క్రీన్ లలో ఈ మూవీ రిలీజ్ చేయడం విశేషం. విడుదలైన వారంలోపే ఐదు కోట్ల గ్రాస్ ను దాటేసింది. మొదటి చిత్రంతోనే సమంత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×