BigTV English

Credit Card: క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్డ్.. జూన్ 1 నుంచి చార్జీల మోత

Credit Card: క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్డ్.. జూన్ 1 నుంచి చార్జీల మోత

Credit Card| ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. అందుకే బ్యాంకులు ఈ క్రెడిట్ కార్డు వినియోగద్వారులను మంచి ఆదాయ మార్గంగా చూస్తున్నారు.


ఈ క్రమంలోనే, బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు అనేక కొత్త అప్‌డేట్లు ఇవ్వడం జరుగుతోంది. ముఖ్యంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్న వారికి బ్యాంకు రుసుము పెరగనుంది. ఎందుకంటే, జూన్ 1, 2025 నుండి బ్యాంక్ తమ క్రెడిట్ కార్డ్ విధానాలలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయనుంది. ఈ మార్పుల వల్ల వినియోగదారులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉండటం వల్ల ఈ సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

రివార్డ్ పాయింట్లలో మార్పులు:
జూన్ 1, 2025 నుంచి కోటక్ మహీంద్రా బ్యాంక్ తమ క్రెడిట్ కార్డులకు సంబంధించి కీలక మార్పులను అమలు చేయనుంది. ముఖ్యంగా కరెంటు, గ్యాస్ లాంటి యుటిలిటీ బిల్లులు, పెట్రోల్, ఆన్‌లైన్ గేమింగ్, బీమా ప్రీమియం చెల్లింపులు, లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు ఇవ్వడాన్ని కొత్త లిమిట్స్‌తో మార్చనున్నారు. ఈ మార్పులు అన్ని క్రెడిట్ కార్డ్ రకాలపై ఒకే విధంగా కాకుండా, వేర్వేరు కార్డుల రకాలను బట్టి భిన్నంగా అమలవుతాయి. దీని ప్రభావం నేరుగా కార్డు వినియోగదారులపై పడనుంది.


వడ్డీ రేటులో పెంపు:
బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. జూన్ మొదటి తేదీ నుండి ఒక పెద్ద మార్పు అమల్లోకి రానుంది. అదేంటంటే, క్రెడిట్ కార్డులపై నెలవారీ ఫైనాన్స్ ఛార్జీలు పెరుగుతాయి. ఇప్పటివరకు ఇది నెలకు 3.50% (అంటే వార్షికంగా 42%)గా ఉండగా, జూన్ 1 నుంచి ఇది 3.75% (వార్షికంగా 45%)కి పెరగనుంది.

కోటక్ ఇన్ఫినిట్, వైట్ సిగ్నేచర్ కార్డులపై వడ్డీ రేటు 3.10% నుండి 3.50% రేంజ్‌లో పెరగనుంది.

కోటక్ ప్రివీ లీగ్ సిగ్నేచర్ కార్డుకి నెలవారీ వడ్డీ రేటు 2.49% నుండి 3.50% మధ్య ఉంటుంది.

అయితే, కోటక్ వైట్ రిజర్వ్, కోటక్ సాలిటైర్ వంటి ప్రీమియం కార్డులు మాత్రం ఇప్పటివరకు ఉన్న వడ్డీ రేట్లతోనే కొనసాగుతాయి. వాటిపై ఎలాంటి మార్పులు లేవు.

Also Read: ఫోన్ చోరి అయిందా? దొంగలు ఆ ఫోన్ ఉపయోగించకుండా ఉండేందుకు కొత్త ఫీచర్

లావాదేవీ ఛార్జీల మార్పులు:
జూన్ 1వ తేదీ నుండి కోటక్ మహీంద్రా బ్యాంక్ అన్ని రకాల క్రెడిట్ కార్డులపై లావాదేవీల చార్జీలను కూడా అప్డేట్ చేయనుంది. ఇందులో విద్యా ఖర్చులు, వాలెట్ లోడ్‌లు, ఆన్‌లైన్ గేమింగ్, ఇంధన వినియోగం, అద్దె చెల్లింపులు వంటి లావాదేవీలు ఉన్నాయి.

పరిమితి మించిన ఖర్చు జరిగితే, 1% లావాదేవీ ఛార్జీ విధించనున్నారు.

అదనంగా, బకాయి ఉన్న ఖాతాలపై 1% లేదా కనీసం రూ.100 వరకు అదనపు చార్జీ వసూలు చేయనున్నారు.

ఈ మార్పులు కార్డు వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, వినియోగదారులు తమ ఖర్చులపై పునర్విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మార్పులకు అనుగుణంగా తమ ఖర్చులను సర్దుబాటు చేసుకోవటం వల్ల ఇబ్బందులను నివారించవచ్చు.

మినిమమ్ బ్యాలెన్స్ చెల్లింపులతో జాగ్రత్త

ఇప్పుడు క్రెడిట్ కార్డులతో సులభంగా అప్పు తీసుకొని షాపింగ్ చేయవచ్చు. అయితే, బిల్లు చెల్లింపులో సమస్యలు తలెత్తుతాయి. కొందరు పూర్తి మొత్తం కడతారు, మరికొందరు మినిమమ్ బిల్లు చెల్లించి తాత్కాలిక ఊరట పొందుతుంటారు.

క్రెడిట్ కార్డు బిల్లులో మూడు చెల్లింపు ఎంపికలు ఉంటాయి: పూర్తి మొత్తం, మినిమమ్ అమౌంట్, ఇతర మొత్తం. మినిమమ్ అమౌంట్ (సాధారణంగా 5% బిల్లు) చెల్లిస్తే పెనాల్టీ, ఆలస్య రుసుముల నుంచి ఉపశమనం లభిస్తుంది, కానీ మిగిలిన మొత్తంపై బ్యాంకు 36-48% వడ్డీ విధిస్తుంది.

మినిమమ్ చెల్లింపు లాభాలు:

  • పెద్ద మొత్తం భారం తప్పుతుంది.
  • అకౌంట్ రెగ్యులర్‌గా ఉంటుంది.
  • ఆలస్య రుసుములు విధించబడవు.
  • క్రెడిట్ స్కోరుపై ప్రభావం తక్కువ.

నష్టాలు:

  • భారీ వడ్డీ భారం.
  • వడ్డీతో అప్పు పెరిగే ప్రమాదం.
  • క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో పెరిగి క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది.
  • కొత్త రుణాలు, కార్డులు పొందడం కష్టమవుతుంది.
  • అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డు ఉపయోగం కష్టమవుతుంది.

మినిమమ్ చెల్లింపులు తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా, దీర్ఘకాలంలో అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.

 

Related News

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Big Stories

×