E-Paper
Advertisement

CM Revanth Reddy: గరం.. నరం.. బేశరం కావొద్దు.. నిబద్ధతతో పనిచేయాలని గ్రూప్-1 అధికారులకు సీఎం హితవు

CM Revanth Reddy: గరం.. నరం.. బేశరం కావొద్దు.. నిబద్ధతతో పనిచేయాలని గ్రూప్-1 అధికారులకు సీఎం హితవు
Advertisement

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర నవ నిర్మాణంలో అధికారుల పాత్ర అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో జరిగిన గ్రూప్-1.. గ్రూప్-2 అధికారుల శిక్షణ ముగింపు వేడుకలో ఆయన ప్రసంగించారు. నిన్నటి వరకు విద్యార్థులుగా.. నిరుద్యోగులుగా ఉన్న మీరు నేడు ప్రభుత్వ ప్రతినిధులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని.. ఆధిపత్యాన్ని సహించరని గుర్తు చేశారు. రాచరికం నుండి ప్రజాస్వామ్యం వరకు ఈ గడ్డపై జరిగిన పోరాటాల స్ఫూర్తిని అధికారులు తమ పనితీరులో ప్రతిబింబించాలని సూచించారు. సమ్మక్క-సారలమ్మ.. కొమరం భీం.. చాకలి ఐలమ్మ వంటి వీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రజాసేవలో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకం క్షేత్రస్థాయిలో నిరుపేదలకు చేరడంలో అధికారులదే ప్రధాన బాధ్యత అని సీఎం పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు.. రేషన్ కార్డు.. ఉచిత విద్యుత్.. రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలకు అధికారులే కళ్లు.. చెవులు అని వ్యాఖ్యానించారు. సచివాలయంలో తాను చేసే నిర్ణయాలు అమలయ్యేది అధికారుల చిత్తశుద్ధి వల్లనే అని స్పష్టం చేశారు. కేవలం ఎనిమిది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుంటే గ్రూప్-1 అధికారులు ఐఏఎస్ హోదా పొందే అవకాశం ఉందని.. ఆ దిశగా కష్టపడి పనిచేయాలని ప్రోత్సహించారు. పనిచేసే చోట ఎస్ఆర్ శంకరన్ వంటి నిజాయితీ గల అధికారులను స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు పలికారు.

Advertisement

కుటుంబ విలువలపై సీఎం కీలక వ్యాఖ్యలు చేస్తూ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 నుండి 15 శాతం కోత విధించి.. ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో వేసేలా చట్టం తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. చదువు కోసం ఎంతో కష్టపడిన తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. అలాగే అధికారుల శిక్షణ కోసం హార్వర్డ్ యూనివర్సిటీతో ఎంఓయూ కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో హార్వర్డ్ ప్రతినిధులే హైదరాబాద్ వచ్చి అధికారులకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి పారదర్శకంగా ఈ నియామకాలు పూర్తి చేశామని సీఎం వివరించారు. లీగల్ చిక్కులను అధిగమించి అభ్యర్థుల పక్షాన ప్రభుత్వం నిలబడి నియామక పత్రాలు అందజేసిందని గుర్తు చేశారు. మెరిట్ ప్రాతిపదికన ఎంపికైన మిమ్మల్ని అధికారులుగా చూడటం తనకు గర్వకారణంగా ఉందని భావోద్వేగానికి లోనయ్యారు. శిక్షణ ముగిసిన నేపథ్యంలో రేపటి నుండి క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉండి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.

Advertisement

Read Also: Hyderabad Traffic Police: వాహనదారులకు అలర్ట్, మార్చి 1 నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్స్.. ఎందుకంటే?

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×