E-Paper
Advertisement

SVIMS Recruitment: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు.. నెలకు రూ.60వేల జీతం, విద్యార్హత ఇదే..

SVIMS Recruitment: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు.. నెలకు రూ.60వేల జీతం, విద్యార్హత ఇదే..
Advertisement

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (SVIMS) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ (SPMCW) విభాగంలో ఖాళీగా ఉన్న నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలను పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సంస్థ కోరింది.

పోస్టుల వివరాలు.. 

Advertisement

మొత్తం 26 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వీటిలో మెడికల్‌ ఆఫీసర్స్‌ 4, స్టాఫ్ నర్సెస్‌ 4, ఏఎన్‌ఎం 4 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు మామోగ్రఫీ టెక్నీషియన్‌ 2, కార్డియోవస్కులర్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 విభాగంలో 02 ఖాళీలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ అలాగే టెక్నికల్ విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ 2, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ 2, మెడికో సోషల్‌ వర్కర్‌ 2, ఎలక్ట్రీషియన్‌ 2, డ్రైవర్‌ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొత్తం వెకెన్సీల సంఖ్య: 26

Advertisement

విద్యార్హత: 

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌, ఏఎన్‌ఎం లేదా ఎంపీహెచ్‌డబ్ల్యూ ఉత్తీర్ణులై ఉండాలి. మరికొన్ని పోస్టులకు బీఎస్సీ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, ఇంటర్మీడియట్‌ (సైన్స్‌ గ్రూప్‌), ఎస్‌ఎస్‌సీ, డీఈఈ లేదా ఐటీఐ విద్యార్హత అవసరం. విద్యార్హతలతో పాటు సంబంధిత విభాగంలో సర్టిఫికేట్‌ కోర్సులు పూర్తి చేసి పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

జీతం: 

ఎంపికైన వారికి నెలకు రూ.27,500 నుంచి రూ.60,000 వరకు వేతనం అందుతుంది.

వయస్సు: 

అభ్యర్థుల వయస్సు ఇంటర్వ్యూ తేదీ నాటికి 42 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆసక్తి గల వారు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి చేసిన దరఖాస్తులను ది రిజిస్ట్రార్‌, శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, అలిపిరి రోడ్‌, తిరుపతి చిరునామాకు పంపాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీలు.. 

మార్చి 3 నుంచి మార్చి 6 వరకు వివిధ తేదీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో తిరుపతిలోని స్విమ్స్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి. చిత్తూరు జిల్లా అభ్యర్థులతో పాటు అర్హత గల తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://svimstpt.ap.nic.in/

ALSO READ: APCRDA Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అమరావతిలో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×