CM Revanth Reddy: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై తొలిసారి స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. కేజ్రీవాల్ వల్లే కూటమి డిస్టర్బ్ అయ్యిందన్నారు. కేంద్రాన్ని ఎదుర్కోవడానికి కూటమి సమర్థవంతంగా పని చేసిందన్నారు. కేజ్రీవాల్ వల్లే ఇదంతా జరిగిందని ఆగ్రహించారు. ఆయన కారణంగా బీజేపీ లాభపడిందని గుర్తు చేశారు.
ఢిల్లీలో కేజ్రీవాల్-యాంటీ కేజ్రీవాల్ అనే విధంగా పోలింగ్ జరిగిందన్నారు. దీంతో ఆప్ వ్యతిరేక ఓట్లు బీజేపీ వైపు మొగ్గాయన్నారు. కేరళ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, అక్కడ జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, న్యూయార్క్, లండన్ దుబాయ్, సింగపూర్ సిటీలతో హైదరాబాద్ పోటీపడుతుందన్నారు. దావోస్ పర్యటనలో తెలంగాణకు దాదాపు 1.82 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 2035 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మెట్రోరైలును 100 కిలోమీటర్లు మేరా విస్తరిస్తున్నామని వెల్లడించారు.
ప్రస్తుతం తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. 24 గంటల విద్యుత్, రూ. 12000 రైతు భరోసాపై వివరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లో వేలాది ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 2035 లోపు తెలంగాణ జీడీపీ వృద్ధి లక్ష్యంగా ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నట్టు వెల్లడించారు.
ALSO READ: భయం లేదు, బాధ్యత లేదు.. రోడ్లపై కార్ల స్టంట్స్‌తో రెచ్చిపోతున్న ఆకతాయిలు
కేరళ మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో తెలంగాణ, హైదరాబాద్ స్థితిగతులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం
2035 లోపు తెలంగాణ జీడీపీ వృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టు ప్రకటన pic.twitter.com/rOD5h6mixQ
— BIG TV Breaking News (@bigtvtelugu) February 9, 2025