BigTV English

MB Luxe Screen : AMBలో MB లక్స్ స్క్రీన్‌.. వరల్డ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తో!

MB Luxe Screen : AMBలో MB లక్స్ స్క్రీన్‌.. వరల్డ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తో!

MB Luxe Screen : హైదరాబాద్ ఏషియన్ ప్రీమియం మల్టీప్లెక్స్, ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ ప్రపంచ స్థాయి చలనచిత్ర అనుభవాన్ని అందిస్తూ MB లక్స్ స్క్రీన్ ను పరిచయం చేసింది.


ఏషియన్ సినిమాస్ తో కలిసి AMB సినిమాస్‌ను కలిగిన మహేష్ బాబు తాజాగా హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో MB లక్స్ స్క్రీన్ ను స్టార్ట్ చేశారు. ఇందులో అద్భుతమైన విజువల్స్ ను అందిస్తూ ప్రపంచ స్థాయి చలనచిత్ర అనుభవాన్ని అందిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

ఏషియన్ సినిమాస్ తో ఇప్పటికే థియేటర్ రంగంలో రాణిస్తున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ మల్టీప్లెక్స్ హైదరాబాద్లోని అతిపెద్ద మల్టీప్లెక్స్ లో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు ఏషియన్ సినిమాతో కలిసి నిర్వహిస్తున్న ఈ మల్టీప్లెక్స్ హైదరాబాద్ సినీ ప్రేమికులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. 2018లో ప్రారంభించిన ఈ మల్టీప్లెక్స్ లో ఇప్పటికే అత్యాధునిక టెక్నాలజీతో అద్భుతమైన విజువల్స్ తో థియేటర్స్ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఇందులో AMB యాజమాన్యం సరికొత్త ప్రయోగానికి తెర తీసింది. ఇప్పుడు తాజాగా ఏఎంబి సినిమాస్ లో MB లక్స్ స్క్రీన్ ను ప్రారంభించింది.


ALSO READ : తనకు నచ్చింది చేస్తూ.. ప్రేక్షకులకు నచ్చేలా చేస్తాడు

ఇప్పటికే ప్రత్యేక స్క్రీన్స్, ఆధ్యాత్మిక సౌండ్ సిస్టమ్, రిక్లైనర్ సీట్లతో అద్భుతంగా ఉన్న ఏఎంబి థియేటర్స్ లో.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం సినిమాను ఎంజాయ్ చేసే విధంగా అత్యాధునిక టెక్నాలజీతో ఆకట్టుకునేలా స్క్రీన్ ను డిజైన్ చేశారు. దీంతో ఇప్పటికే తాజాగా ప్రారంభించిన MB స్క్రీన్ తో సీట్లు సదుపాయాలు మరింత లగ్జరీగా ఉండనున్నాయి.

లగ్జరీ, కంఫర్ట్, ఎక్స్పీరియన్స్ తో హై ధియేటర్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తున్న AMB సినిమాస్ సరికొత్త లగ్జరీ స్కీన్ ను ప్రారంభింది. ఇందుకు AMB టీమ్ కు శుభాకాంక్షలు అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

ప్రస్తుతం మహేష్ బాబు SSMB29 సినిమా షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కబోతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభం కాగా హై విజువల్ ఎఫెక్ట్ తోపాటు ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఇక కథ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందించగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

అడవి నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం మహేష్ బాబు చాలా కష్టపడుతున్నారని సినీ వర్గాల టాక్. ఇంకా ఏడాది నుంచి ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళినా క్యాప్ తోనే దర్శనమిస్తున్నారని.. దీంతో సినిమాలో మహేష్ బాబు స్పెషల్ లుక్ లో కనిపించబోతున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇటీవల సినిమా షూట్ కోసం మహేష్ బాబు పాస్ పోర్ట్ సైతం రాజమౌళి లాక్కున్నారని పెట్టిన పోస్ట్ సైతం వైరల్ గా మారింది. దీంతో ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×