BigTV English

MP Purandeswari: ఎక్కడ ఎన్నికలు జరిగినా.. బీజేపీ జెండా రెపరెపలు: పురందేశ్వరి

MP Purandeswari: ఎక్కడ ఎన్నికలు జరిగినా.. బీజేపీ జెండా రెపరెపలు: పురందేశ్వరి

MP Purandeswari: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి స్పందించారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా రెపరెపలాడుతోందని ఆనందం వ్యక్తం చేశారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. 27 ఏళ్ల సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలో వచ్చాం. కార్యకర్తల కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. బీజేపీకి ఘన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగినా బీజేపీని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలో గడిచిన ఐదు సంవత్సరాలలో విధ్వంసాలు, కక్షలతో పాలనతో  సాగిందని పురందేశ్వరి మండిపడ్డారు.


ఏపీలో గత ప్రభుత్వం రాష్ట్రాభిద్ధిని నిర్లక్ష్యం చేసిందని, అభివృద్ది అనే పదానికి తావులేకుండా పోయిందన్నారు. దోచుకోవడంపైనే వైసీపీ నేతలు దృష్టిసారించారని ఫైర్ అయ్యారు. కేవలం తమ జేబులు నింపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ వైసీపీ పాలన సాగిందని కామెంట్స్ చేశారు. రాష్ట్రప్రజలు కూటమికి అనూహ్య విజయం అందించారని తెలిపారు. రాష్ట్రంలో ఏ విధంగా మద్యం స్కాం జరిగిందో.. అదే తరహాలో ఢిల్లీలో మద్యం స్కాం జరిగిందని ఆసక్తిర కామెంట్స్ చేశారు. ఢిల్లీ ఆప్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారనన్నారు. అందరికి సమాన అవకాశాలు ఇవ్వాలనే రాజ్యాంగ స్ఫూర్తితో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బిడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు అంగీకరించడం లేదని ఆసక్తిర కామెంట్స్ చేశారు.

డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి ఏవిధంగా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను లాభాలతో నడిపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. గడిచిన ఐదు ఏళ్లలో పోలవరం ప్రాజెక్ట్‌కు చిటికెడు మట్టి కూడా వేయలేదంటూ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోందని పురందేశ్వరి తెలిపారు. గడిచిన ఐదేళ్లలో అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.


Also Read: గుంటూరు, విశాఖ కార్పొరేషన్‌పై టీడీపీ కన్ను.. మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి

అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని బీజేపీ ముందు నుంచి చెబుతుందని పేర్కొన్నారు. ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా బ్రిటిష్ కాలంలో పెట్టిన వాల్తేర్ డివిజన్ పేరును విశాఖ డివిజన్‌గా మార్చమని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో రోడ్డు మరమ్మతులు, నిర్మాణాలు చేస్తున్నాం అన్నారు. కె కె లైన్, అరకు రైల్వే స్టేషన్ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని మంత్రి చెప్పారు. ఆ రైల్వేస్టేషన్‌ను వదులుకొనే పరిస్థితి లేదు. విశాఖ డివిజన్‌లో కొనసాగించే విధంగా ప్రయత్నం చేస్తాం.

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: మా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×