BigTV English

CM Revanth Delhi Tour: రాహుల్‌‌‌‌తో రేవంత్ రెడ్డి.. కేబినెట్‌ బెర్తులపై సంకేతాలు!

CM Revanth Delhi Tour: రాహుల్‌‌‌‌తో రేవంత్ రెడ్డి.. కేబినెట్‌ బెర్తులపై సంకేతాలు!

Telangana CM Revanth Reddy Delhi Tour: రేవంత్ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ నుంచి గ్రీన్‌ సిగ్నల్ వస్తుందా? లేక మరింత ఆలస్యం కానుందా? తెలంగాణలోని కాంగ్రెస్ కీలక నేతలకు ఢిల్లీకి వెళ్లడం వెనుక అసలేం జరుగుతోంది? అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చాయా? మంత్రి విస్తరణతోపాటు పార్టీ పదవులు ఓ కొలిక్కి వచ్చేనా? అవుననే సంకేతాలు ఆ పార్టీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది.

తెలంగాణ కేబినెట్‌లో ఇంకా ఆరు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. ఇటు మంత్రి పదవులు, అటు పీసీసీ పదవుల కోసం పలువురు నేతలు క్యూలో కనిపిస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఆ క్రమంలో అతి త్వరలోనే ఆ లాంఛనం పూర్తవుతుందన్న టాక్ బలంగా వినిపిస్తుంది

పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో నిర్ణయం తీసుకోనుందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది … ఇదే విషయమై ఢిల్లీ పెద్దలతో చర్చించి, తమ అభిప్రాయాలను పంచుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేశ్‌కుమార్‌గౌడ్‌ వంటి నేతలు ఢిల్లీకి వెళ్లారు.

ఇదిలావుండగా కొన్ని మంత్రి పదవులు, ఉప సభాపతి, చీఫ్‌ విప్‌.. ఇలా అన్ని పదవుల నియామకాల్లోనూ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలని గతంలో ఒక నిర్ణయానికి వచ్చారు. పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇచ్చారు. కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ ఛైర్మన్‌ పదవులను ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చే అవకాశముంది.

మంత్రివర్గ విస్తరణపైనా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. కొత్తగా మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకొనేందుకు అవకాశముంది. వాటిలో ఒకట్రెండు పెండింగ్‌లో పెట్టి మిగిలినవి భర్తీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సామాజికవర్గం లెక్కలతో వాకిటి శ్రీహరి ముదిరాజ్‌, పి.సుదర్శన్‌రెడ్డి, గడ్డం వివేక్‌లకు అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది.

మరోవైపు ఎన్నికలకు ముందు పార్టీలో చేరే సమయంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి మంత్రివర్గంలోకి తీసుకుంటామనే హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు .. ఆయనకూ అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎవరూ లేనందున ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డిలలో ఒకరికి అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.

ఇదిలావుండగా మైనార్టీల నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. షబ్బీర్‌అలీ, అజారుద్దీన్‌ల పేర్లు కొత్తగా తెరపైకి వస్తున్నాయి. వారిద్దరిలో ఎవరిని మంత్రి పదవి వరించినా, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. మరి కాంగ్రెస్ హైకమాండ్‌, సీఎం రేవంత్‌రెడ్డిల ఈక్వేషన్లు ఎలా ఉంటాయి?

Also Read: రూ.5,438కోట్ల వరద నష్టం.. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక!

రేవంత్ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ నుంచి గ్రీన్‌ సిగ్నల్ వస్తుందా? లేక మరింత ఆలస్యం కానుందా? తెలంగాణలోని కాంగ్రెస్ కీలక నేతలకు ఢిల్లీకి వెళ్లడం వెనుక అసలేం జరుగుతోంది? అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చాయా? మంత్రి విస్తరణతోపాటు పార్టీ పదవులు ఓ కొలిక్కి వచ్చేనా? అవుననే సంకేతాలు ఆ పార్టీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది.

తెలంగాణ కేబినెట్‌లో ఇంకా ఆరు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. ఇటు మంత్రి పదవులు, అటు పీసీసీ పదవుల కోసం పలువురు నేతలు క్యూలో కనిపిస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఆ క్రమంలో అతి త్వరలోనే ఆ లాంఛనం పూర్తవుతుందన్న టాక్ బలంగా వినిపిస్తుంది

పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో నిర్ణయం తీసుకోనుందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే విషయమై ఢిల్లీ పెద్దలతో చర్చించి, తమ అభిప్రాయాలను పంచుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేశ్‌కుమార్‌గౌడ్‌ వంటి నేతలు ఢిల్లీకి వెళ్లారు.

ఇదిలావుండగా కొన్ని మంత్రి పదవులు, ఉప సభాపతి, చీఫ్‌ విప్‌.. ఇలా అన్ని పదవుల నియామకాల్లోనూ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలని గతంలో ఒక నిర్ణయానికి వచ్చారు. పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇచ్చారు. కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ ఛైర్మన్‌ పదవులను ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చే అవకాశముంది.

మంత్రివర్గ విస్తరణపైనా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. కొత్తగా మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకొనేందుకు అవకాశముంది. వాటిలో ఒకట్రెండు పెండింగ్‌లో పెట్టి మిగిలినవి భర్తీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సామాజికవర్గం లెక్కలతో వాకిటి శ్రీహరి ముదిరాజ్‌, పి.సుదర్శన్‌రెడ్డి, గడ్డం వివేక్‌లకు అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది.

మరోవైపు ఎన్నికలకు ముందు పార్టీలో చేరే సమయంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి మంత్రివర్గంలోకి తీసుకుంటామనే హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆయనకూ అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎవరూ లేనందున ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డిలలో ఒకరికి అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.

ఇదిలావుండగా మైనార్టీల నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. షబ్బీర్‌అలీ, అజారుద్దీన్‌ల పేర్లు కొత్తగా తెరపైకి వస్తున్నాయి. వారిద్దరిలో ఎవరిని మంత్రి పదవి వరించినా, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. మరి కాంగ్రెస్ హైకమాండ్‌, సీఎం రేవంత్‌రెడ్డిల ఈక్వేషన్లు ఎలా ఉంటాయి?

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×