BigTV English

Tirupati Reddy on Hydra Notices: హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు.. నిబంధనల ప్రకారం నా ఇల్లు లేకుంటే..

Tirupati Reddy on Hydra Notices: హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు.. నిబంధనల ప్రకారం నా ఇల్లు లేకుంటే..

Tirupati Reddy Responded on Hydra Notices: హైడ్రా నోటీసులపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. దుర్గంచెరువు ఎఫ్టీఎల్ నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘అమర్ సొసైటీలో నేను ఇంటిని కొనుగోలు చేశాను. అయితే, నాకు ఇల్లు అమ్మిన యజమాని అన్ని అనుమతులతోనే ఇంటిని నిర్మించారు. కానీ, కొనుగోలు చేసేటప్పుడు ఇల్లు బఫర్ జోన్ లో ఉందని అతని నాకు ముందే చెప్పలేదు. ఇప్పుడు నా ఇల్లు బఫర్ జోన్ లో ఉందంటూ నోటీసులు వచ్చాయి. ఒకవేళ నేను నివాసం ఉంటున్న ఇల్లు  ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే ప్రభుత్వం, హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నిబంధనల ప్రకారం లేకుంటే కూల్చేయవచ్చు. కాకపోతే సమయం ఇవ్వండి. ఆ సమయంలో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతాను.


బీఆర్ఎస్ నేతలు నన్ను లక్ష్యంగా చేసుకుని అమర్ సొసైటీ వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. నన్ను లక్ష్యంగా చేసుకోకపోతే మిగతా వాళ్లు ఇబ్బంది పడేవాళ్లు కాదు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి పేర్కొన్నారు.

Also Read: హైడ్రా నోటీసుల పేరుతో డబ్బులు వసూలు.. సీరియసైన సీఎం రేవంత్ రెడ్డి


తిరుపతిరెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు గురువారం నోటీసులు అంటించిన విషయం తెలిసిందే. మాదాపూర్ లోని అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి నివాసముంటున్నారు. అయితే, ఆ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ఆ ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. మరోవైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు కూడా హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: దుర్గంచెరువు పరిసర ప్రాంతాల వాసులు హడలిపోతున్నారు.. ఎందుకో తెలుసా?

ఇదిలా ఉంటే.. అధికారులు ఇప్పటికే 204 మందికి నోటీసులు పంపారు. నెల రోజుల్లో ఎవరికి వారే స్వచ్ఛందంగా అక్రమ నిర్మాణాలు తొలగించుకోవాలని, లేకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్న ఏరియాల్లో ఎవరు ఉన్నా కూల్చివేస్తామని, ఆఖరుకు తన కుటుంబ సభ్యులైనా, బంధువులు ఉన్నా ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి సైతం నోటీసు పంపారు రెవెన్యూ అధికారులు. అమర్ కో ఆపరేటివ్ సొసైటీలో ఆయన నివాసం ఉంటున్నారు. ఆ ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. దుర్గం చెరువును ఆనుకొని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు అందాయి. నెలలోపు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలంటూ ఆ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. కాగా, దుర్గం చెరువు పరిధిలో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులతోపాటు సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నట్లు తెలిసింది.

Related News

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

TG Number Plates: ఇకపై ఆ వాహనాలపై ‘తెలంగాణ పోలీస్’ స్టిక్కర్లు.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు

Union Bank Manager Fraud: 10 నకిలీ గోల్డ్ లోన్ అకౌంట్స్.. రూ.75 లక్షలు.. బయటపడ్డ యూనియన్ బ్యాంకు మేనేజర్ బాగోతం

Hyderabad News: అడ్డంగా దొరికిపోయిన కేఏ పాల్‌.. పోలీసుల చేతుల్లో ఆయన గుట్టు

Hyderabad: ఘనంగా సెలబ్రిటీ డాండియా నైట్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Big Stories

×