CM Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ రాసిన లేఖపై రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. జపాన్‌లోని హిరోషిమా చారిత్రక నగరంలో నేను మీ లేఖను చదివానని ప్రస్తావించారు.
అదృష్టవశాత్తూ నేను ఇక్కడ మహాత్మా గాంధీజీ విగ్రహం ఉన్న పవిత్ర స్థలాన్ని సందర్శించబోతున్నప్పుడు మీ లేఖ చదివాను, మీ స్ఫూర్తిదాయకమైన పిలుపు నాకు బలంగా తాకిందని ప్రస్తావించారు. గర్వించదగిన భవిష్యత్తును రూపొందించడంలో మీ ఆలోచనలు, భావాల స్ఫూర్తితో ముందుకు వెళ్తామన్నామని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
ఇంతకీ రాహుల్‌గాంధీ.. సీఎం రేవంత్‌కు రాసిన లేఖలోని సారాంశం ఏంటి? రోహిత్ వేముల చట్టాన్ని తీసుకరావాలని లేఖలో ప్రస్తావించారు అగ్రనేత. బీఆర్ అంబేద్కర్, రోహిత్ వేముల మాదిరిగా లక్షలాది మంది ఎదుర్కొన్న కుల వివక్ష ఇకపై ఎవరు ఎదుర్కోవద్దన్నారు. కుల వివక్ష, అంటరాని తనంపై సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను లేఖలో పేర్కొన్నారు. దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందన్న పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ సైతం కుల వివక్షను ఎదుర్కోన్నారని ఈ విషయాన్ని రాహుల్ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ పరిస్థితి అప్పుడే కాదు.. ఇప్పటికీ ఉందన్నది రాహుల్ గాంధీ మాట. దీనిపై చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేయాలని ఇటీవల కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కోరారు. అగ్రనేత లేఖపై వెంటనే రియాక్ట్ అయ్యారు కూడా. ‘రోహిత్ వేముల చట్టం’ ముసాయిదాను ప్రారంభించమని న్యాయ బృందాన్ని ఆదేశించినట్లు తెలిపారు.
ALSO READ: రాజీవ్ యువ వికాసం కీలక అప్ డేట్స్, ఒక్క ఛాన్స్ ప్లీజ్
ఏ విద్యార్థి అయినా కుల వివక్షకు గురైతే అది నిజంగా సిగ్గు చేటు. దళితులు, ఆదివాసీలు, ఓబీసీ కులాలు ఇప్పటికే కుల వివక్షను ఎదుర్కొనే వారిలో ఉన్నారన్నారు. నేటి సమాజంలో ఇప్పటికే లక్షల మంది కుల వివక్ష బారిన పడుతున్నారు. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ వేముల సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన కుల వివక్ష, సామాజిక అన్యాయాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.
ఆ సమయంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన రాహుల్‌గాంధీ, అక్కడి వర్సిటీ విద్యార్థులతో మాట్లాడిన విషయం తెల్సిందే. ఈ చట్టం అమలైతే యూనివర్శిటీల్లో విద్యార్థులకు మంచి వాతావరణం, సమాన హక్కులు, మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు అవుతాయి. కఠిన శిక్షలు, నివారణ చర్యలు అమలవుతాయి.
Dear @RahulGandhi Ji ,
I read your letter in the historic city of Hiroshima, Japan. Fortuitously, I read your words just as I was about to visit the holy site of Mahatma Gandhi ji’s statue here.
Deeply touched by your words, and the inspiring call for action.
We will go… pic.twitter.com/Rwk6l7lQCs
— Revanth Reddy (@revanth_anumula) April 22, 2025