Singer Pravasthi:దాదాపు 25 సంవత్సరాలుగా ప్రేక్షకులను, శ్రోతలను ఎంతగానో అలరిస్తున్న ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ఇటీవలే సిల్వర్ జూబ్లీ సీరీస్ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సింగర్ సునీత (Singer Sunitha), ఆస్కార్ గ్రహీత , ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి(MM .Keeravani), రచయిత చంద్రబోస్ (Chandrabose) జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇందులో శ్రీరామదాసు సినిమాలోని ఒక పాటను సింగర్ ప్రవస్తి (Singer Pravasthi) ఆలపించగా.. దీనిపై సింగర్స్ సునీతతో పాటు మిగిలిన జడ్జెస్ కూడా కాస్త అభ్యంతరాలు వ్యక్తం చేసి ఆమెను ఎలిమినేట్ చేశారు. ఇక ఎలిమినేట్ అయిన వెంటనే సింగర్ ప్రవస్తి ‘పాడుతా తీయగా’ షోపై కామెంట్లు చేస్తూ కీరవాణి, సునీత తనను అవమానపరిచారు అని, రికమండేషన్ ఉంటేనే ఇలాంటి షోలకు వెళ్ళండి అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది.
సింగర్ ప్రవస్తిపై లిప్సిక రియాక్షన్..
ఆ వీడియో అలా రిలీజ్ చేసిందో లేదో వెంటనే ఎవరికి వారు తమకు నచ్చినట్టు థంబ్ నెయిల్స్ పెట్టి కథనాలు అల్లేసారు. దీనికి తోడు బాడీ షేమింగ్ పై కూడా ప్రవస్తి కామెంట్లు చేయడంతో జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ వారు కూడా స్పందించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరో సింగర్ లిప్సిక (Singer Lipsika) కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఆ వీడియోలో లిప్సిక ఏం మాట్లాడిందంటే..?
లిప్సిక మాట్లాడుతూ.. “సిస్టర్ ప్రవస్తి పాడుతా తీయగా షోలో తనకు ఏం జరిగింది అనే విషయాన్ని చెబుతూ ఒక వీడియో పెట్టింది. ఎంతమందికి మెచ్యూరిటీ ఉంది.. ఆ వీడియోని అర్థం చేసుకోవడానికి.. ఏ స్టోరీ కైనా సరే రెండు సైడ్స్ ఉంటాయి. అటువైపు ఏం జరిగింది అనే విషయాన్ని చూడకుండా.. తెలుసుకోకుండా ఎలా జడ్జి చేయగలుగుతాము. తను తన బాధను వ్యక్తం చేస్తూ ఒక వీడియో పెడితే.. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మాత్రం ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు థంబ్ నెయిల్స్ పెట్టి ఒక 100 వీడియోలు చేశారు. అసలు దీంతో సంబంధం లేకుండా పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్. ఎవరికైనా సరే అనుభవం ఉండాలి.. అసలు అక్కడ ఏం జరుగుతోంది అని తెలుసుకోవడానికి. ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుంది.. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే ఎంత ప్రయత్నం చేయాలి.. ?ఎంత అనుభవం ఉండాలి..?అసలు ప్రపంచం ఎలా పనిచేస్తుంది..? అని అన్ని విషయాలపై కూడా అవగాహన ఉండాలి. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా పైకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు జడ్జెస్ గా ఉన్న వారు కూడా ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారు. అవమానాలు ఎదుర్కొన్నారు. నేడు ఈ స్థాయిలో వారు నిలబడ్డారు అంటే నాడు వారు ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోగలగాలి. ప్రతి ఒక్క సక్సెస్ స్టోరీ వెనక కచ్చితంగా ఒక హార్డ్ వర్క్ ఉంటుంది. అందరూ కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ప్రవస్తి ఎవరి పేర్లు అయితే ఆ వీడియోలో మెన్షన్ చేసిందో వారు కూడా అలా కష్టపడి పైకి వచ్చిన వాళ్లే. వాళ్ళ అనుభవం, వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ టాలెంట్ ఇవన్నీ చూసి మనం ఇన్స్పైర్ అయి పెరిగాము. నేను వ్యక్తిగతంగా చెప్పేదేమంటే పేర్లను మెన్షన్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ల అనుభవం ముందు మనం ఎంతో నేర్చుకోవాలి.. అసలు ఒక షోకి వెళ్లాలనుకున్నప్పుడు.. ఆ షో కి వెళ్లాలా..? వద్దా..? అనేది పూర్తిగా నీ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. ఇక నచ్చిన వాళ్లకు మాత్రమే అవకాశాలు ఇస్తారు అని కూడా ప్రవస్తి చెప్పింది. ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే షోకి తీసుకురా అని చెబితే.. నాకు తెలిసిన వాళ్ళను మాత్రమే నేను షో కి తీసుకెళ్తాను. ఎందుకంటే తెలియని వ్యక్తులతో బాండింగ్ కరెక్ట్ గా ఉండదు. తెలిసిన వ్యక్తులతో కలిసి పనిచేస్తే అవుట్ పుట్ చక్కగా ఉంటుంది. అదే ఎవరైనా ఆలోచిస్తారు. ఎవరు కూడా ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడరు. నేను కూడా ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నాను. అంతే తప్ప ఒక్క సంఘటనకే అందరి పేర్లు బయట పెట్టేసి అందరినీ బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు” అంటూ ప్రవస్తి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యింది సింగర్ లిప్సిక. ప్రస్తుతం లిప్సిక వదిలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
also read:Thudarum Telugu Trailer: మోహన్ లాల్ తుడరుమ్ మూవీ ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే..?
?utm_source=ig_web_copy_link