Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ ‘రాజీవ్ యువ వికాసం’. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 16 లక్షలకు పైగానే అప్లికేషన్లు వచ్చాయి. దీనికి యువత నుంచి ఫుల్ డిమాండ్ నెలకొన్నట్లు తెలుస్తోంది. కేవలం ఏడాది కాకుండా మూడేళ్లు పొడిగిస్తే బాగుంటుదని ప్రజా ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డికి రిక్వెస్ట్ చేశారట. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
స్కీమ్ కి పెరిగిన డిమాండ్
రాజీవ్ యువ వికాసం పథకానికి ఎక్కవ మంది 2 నుంచి 4 లక్షల విలువైన యూనిట్లకు అప్లై చేస్తున్నారు. ఈ విభాగానికి దాదాపు 70 శాతం సబ్సిడీ రానుంది. గరిష్టంగా 2.80 లక్షల వరకు రానుంది. మొత్తం దరఖాస్తుల్లో 76 శాతం ఈ కేటగిరీకి చెందివని అంటున్నారు అధికారులు. ఈ విభాగం ద్వారా మెరుగైన ఉపాది పొందవచ్చని అంటున్నారు.
100 శాతం సబ్సడీకి సంబంధించిన విభాగంలో కేవలం 50 వేల రుణాలకు కేవలం 39 వేలదరఖాస్తులు వచ్చాయి. రోజువారీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి ఉపయోగంపడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. యువత దీనిపై పెద్దగా మొగ్గు చూపలేదని తెలుస్తోంది.
50 నుంచి లక్ష లోపు రుణాల విభానికి 93 వేల మంది దరఖాస్తు చేశారు. దీనికి దీనికి 90 శాతం సబ్సిడీ రానుంది. వచ్చిన దరఖాస్తులు కార్పొరేషన్ల వారిగా చూద్దాం. బీసీలు- 8 లక్షలు, ఎస్సీ-3.9 లక్షలు, మైనార్టీలు- 2.4 లక్షలు, ఎస్టీల కింద 1.8 లక్షల దరఖాస్తులు వచ్చాయని సమాచారం.
ALSO READ: మారాష్ట్రానికి రండి.. వ్యాపారవేత్తకు సీఎం రేవంత్ ఆహ్వానం
నేతలపై నిరుద్యోగుల ఒత్తిడి
డిమాండ్ అధికంగా ఉండడంతో ఈ పథకానికి తమను ఎంపిక చేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల స్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది. క్యాంప్ ఆఫీసుల ముందు యువత క్యూలు కడుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న డిమాండ్ దృష్ట్యా మూడేళ్ల పాటు ఈ స్కీమ్ కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజాప్రతినిధులు రిక్వెస్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఈసారి దక్కనివారికి వచ్చే ఏడాది వరకు పొడిగింపు ఇస్తే బాగుంటుందని దీనివల్ల అందరికీ ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. మరి సీఎం మనసులో ఏముంది? అనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ నియోజక వర్గానికి 4,200 చొప్పున 119 నియోజకవర్గాలకు దాదాపు 5 లక్షల యూనిట్లను ప్రభుత్వం కేటాయించింది.
రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడవు పెంచుకుంటూ పోయింది ప్రభుత్వం. ఒక్కసారి మాత్రమే అమలు చేస్తారని భావించిన నిరుద్యోగులు, భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. మొదటి జాబితాలో తమ పేరులా చూడాలని ఎమ్మెల్యేలకు విన్నవించుకుంటున్నారు. ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. ఈ క్రమంలో స్కీమ్ గడువు ప్రభుత్వం పెంచుతుందా? లేదా అనేది చూడాలి.