BigTV English

Hyderabad Future City: ప్రపంచాన్ని తలదన్నేలా ఫ్యూచర్ సిటీ మ్యాప్

Hyderabad Future City: ప్రపంచాన్ని తలదన్నేలా ఫ్యూచర్ సిటీ మ్యాప్

Hyderabad Future City: హైదరాబాద్‌‌ ఒరిజినల్ సిటీకి ఓ చరిత్ర ఉంది. న్యూ సిటీ.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచింది. కొత్తగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ రాబోతోంది. ఈ మహా నగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా.. తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ప్యూచర్ సిటీతో.. ఓ కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. కొత్తగా రాబోయే ఫ్యూచర్ సిటీ.. దక్షిణ తెలంగాణలో అర్బన్ డెవలప్‌మెంట్‌ని శాసించే కీలకమైన ఫ్యాక్టర్‌గా మారబోతోంది.
ఫ్యూచర్ సిటీకి.. ప్లాన్ రెడీ!


హైదరాబాద్‌ని ఆనుకొని మరో కొత్త నగరం

కొన్నేళ్లలో సిటీ రూపురేఖలు మారిపోతాయా?


ఫ్యూచర్ సిటీలో ఏమేం రాబోతున్నాయ్?

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని మరింత పెంచేలా, భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడకుండా కొత్త నగరాన్ని అందించేలా.. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం.. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని సైతం నియమించింది. మరి.. ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతోంది? అందులో.. ఏమేం రాబోతున్నాయి? ఎన్ని వేల ఎకరాల్లో.. కొత్త నగరం రూపుదిద్దుకోబోతోంది? అనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. అయితే.. లేటెస్ట్‌గా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మ్యాప్‌ని ప్రభుత్వం రిలీజ్ చేసింది. దాంతో.. నగరానికి ఆనుకొని రాబోతున్న కొత్త సిటీ ఎలా ఉండబోతోందన్న దానిపై ఉన్న.. అనేక అనుమానాలన్నీ తీరిపోవడంతో పాటు అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.

సౌత్ కొరియాలోని ఇంచియన్ ఫ్రీ ఎకనమిక్ జోన్ సూచనలు

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్‌ప్రెస్ వే పట్టణాల నమూనాల నుంచి స్ఫూర్తి పొంది.. సౌత్ కొరియాలోని ఇంచియాన్ ఫ్రీ ఎకనమిక్ జోన్ సూచనలతో.. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటినీ స్థాపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రతిష్టాత్మకమైన ప్రణాళికను ప్రతిపాదించింది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాలు

దీని పరిధిలోకి.. మహేశ్వరం, ఆమనగల్‌, కడ్తాల్‌, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాలు రానున్నాయి. ఈ 7 మండలాల్లోని 56 గ్రామాలతో.. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు కానుంది. ఆమనగల్లులో 2 గ్రామాలు, మహేశ్వరం నుంచి 2, మంచాల నుంచి 3, ఇబ్రహీంపట్నంలోని 8 గ్రామాలు, కడ్తాల్‌లో 6, యాచారం నుంచి 17 , కందుకూరు నుంచి 18 గ్రామాలు.. ఇకపై ఫ్యూచర్‌ సిటీ పరిధిలోకి రానున్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హెల్త్ కేర్, విద్య, స్పోర్ట్స్, లైఫ్ సెన్సెస్

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, హెల్త్ కేర్, విద్య, స్పోర్ట్స్, లైఫ్ సెన్సెస్ లాంటి అత్యాధునిక రంగాలన్నింటిని ఒకే చోటుకు తెస్తూ.. ఓ డైనమిక్ ఇండస్ట్రియల్ హబ్‌ని సృష్టించడమే లక్ష్యంగా.. ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ రంగాలతో పాటు ఫ్యూచర్ సిటీలోని ప్రాంతాల్లో.. మౌలిక సదుపాయాల అభివృద్ధి పైనా ఫోకస్ పెట్టారు. ఇది.. దక్షిణ తెలంగాణలో అర్బన్ డెవలప్‌మెంట్‌కు ఓ వేదికగా మారనుంది. మొత్తం లక్షన్నర ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయనున్నారు. ఇందులో 30 వేల ఎకరాల్లో కోర్ ఏరియా ఉంటుంది. ఈ కోర్ ఏరియాలో కీలక సంస్థలు, పరిశ్రమలు, అధిక ప్రాధాన్యత గల రంగాల అభివృద్ధికి భూమిని కేటాయిస్తారు. శ్రీశైలం హైవే నుంచి నాగార్జున సాగర్ హైవే వరకు విస్తరించి ఉన్న మిగతా లక్షా 20 వేల ఎకరాల్లో.. నగరం చుట్టూ ఉన్న వివిధ జోన్‌ల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది.

150 ఎకరాల్లో ఏఐ సిటీ, 120 ఎకరాల్లో హెల్త్ సిటీ

ఇక.. ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో.. 150 ఎకరాల్లో ఏఐ సిటీ, 120 ఎకరాల్లో హెల్త్ సిటీ, 250 ఎకరాల్లో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు కానున్నాయి. అలాగే.. 300 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ రానుంది. 4 వేల 200 ఎకరాల్లో.. ఫార్మా, లైఫ్ సెన్సెస్‌కి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇక.. 3600 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్, మానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తాయి. 1200 ఎకరాలు.. రెసిడెన్షియల్ జోన్‌గా ఉంటుందని.. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి. ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించి.. మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసే బాధ్యతని.. టీజీఐఐసీకి అప్పగించారు.

హైదరాబాద్ నగరం మరో స్థాయికి వెళ్తుందనే అభిప్రాయాలు

సౌత్ కొరియాలోని ఇంచియాన్ లాంటి నగరాల్లో.. విజయవంతంగా అమలైన డెవలప్‌మెంట్ మోడల్‌నే ఇప్పుడు అధికారులు ఫాలో అవుతున్నారు. ఆ స్ట్రాటజీ.. కోర్ ఏరియాలో రద్దీని తగ్గించడంలో బాగా సహాయపడింది. అంతేకాదు.. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్థిక వృద్ధిని కూడా పెంచింది. ప్యూచర్ సిటీ అభివృద్ధితో.. హైదరాబాద్ నగరం మరో స్థాయికి వెళ్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. FCDA ఉన్న ప్రదేశం పరంగా.. అనేక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయంటున్నారు. దీనిని డెవలప్ చేయడం వల్ల.. గ్రేటర్ హైదరాబాద్ నార్త్, వెస్ట్ భాగాల్లోనూ సిటీ మరింత అభివృద్ధి చెందుతుందనే లెక్కలున్నాయి.

Also Read: రాములక్కకు ఎమ్మెల్సీ పదవి.. మిగిలిన ఇద్దరు ఎవరంటే..?

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు దీటుగా నాలుగో నగరం ఆవిష్కృతం కాబోతోంది. అదే.. ఫ్యూచర్ సిటీ! ఈ నగరం రూపుదిద్దుకున్న తర్వాత.. దక్షిణ తెలంగాణలో కీలక మార్పులు రాబోతున్నాయ్. ఇప్పటికే.. ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయ్. ఇప్పుడు.. ఫ్యూచర్ సిటీ మ్యాప్‌ని కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడంతో.. ల్యాండ్ రేట్లు మరింత పెరిగే చాన్స్ ఉంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధితో.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరగనుంది.

హైదరాబాద్‌ని గ్లోబల్ డెస్టినేషన్‌గా మార్చడంపై సీఎం ఫోకస్

హైదారాబాద్.. విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే.. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు సిటీలో పెట్టుబడులు పెట్టాయ్. దాంతో.. హైదరాబాద్‌ని గ్లోబల్ డెస్టినేషన్‌గా మార్చేందుకు.. సిటీ డెవలప్‌మెంట్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే.. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ మ్యాప్ చూస్తుంటే.. కేవలం ఆ ఒక్క ప్రాంతంలోనే కాదు నగరం 4 వైపులా అభివృద్ధి జరగనుంది. ఉత్తరం వైపు.. శంషాబాద్, తుక్కుగూడ, రావిర్యాల, బొంగుళూరు వరకు.. ఫ్యూచర్ సిటీ ఇంపాక్ట్ ఉండనుంది. అదేవిధంగా.. దక్షిణం వైపు.. ఆమనగల్, అప్పారెడ్డిపల్లి, కుర్మేడు వరకు నగరం విస్తరించనుంది. హైదరాబాద్ ఈస్ట్ వైపు.. సాగర్ రోడ్డులో.. ఇబ్రహీంపట్నం, యాచారం, కుర్నేడు వరకు.. ఫ్యూచర్ సిటీ ఎఫెక్ట్ ఉండనుంది.

ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేసేలా మెట్రో రైల్ నిర్మాణం

ఇక.. ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేసేలా మెట్రో రైల్‌ని కూడా విస్తరిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రోని కనెక్ట్ చేస్తామని ఇప్పటికే.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు.. అలైన్‌మెంట్ ఖరారు చేసే పనిలే ఉంది హెచ్ఎంఆర్ఎల్. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా.. అక్కడ గ్రీన్ ఫీల్డ్ రహదారిని కూడా నిర్మించనుంది ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్, అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి.

40 కిలోమీటర్ల పొడవువ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం

అందువల్ల.. భవిష్యత్ ప్రణాళికలు, ట్రాఫిక్ అవసరాలను అనుసరించి.. కొత్తగా రోడ్ల కనెక్టివిటీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న ఓఆర్ఆర్ నుంచి శ్రీశైలం నేషనల్ హైవే వరకు 40 కిలోమీటర్ల పొడవునా.. గ్రీన్ ఫీల్డ్ రోడ్డుని నిర్మించనున్నారు. ఇది గనక పూర్తయితే.. ఆ ప్రాంతాల్లో గణనీయమైన అభివృద్ధి జరగనుంది.

ఈ ఫ్యూచర్ సిటీకి మేజర్ అడ్వాంటేజ్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్

ఈ ఫ్యూచర్ సిటీకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్.. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఇక్కడి నుంచి.. కేవలం 30 నిమిషాల్లోనే ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు. దీనికి దగ్గరలోనే ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు ఉన్నాయి. ఈ రెండూ.. నగరం దక్షిణం వైపు మంచి కనెక్టివిటీని అందించనున్నాయి. కొత్తగా సృష్టించబోయే ఫ్యూచర్ సిటీ.. కాలుష్యరహిత గ్రీన్ సిటీగా ప్రపంచంలోనే అద్భుత నగరాల సరసన చేరాలన్నదే ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగానే.. ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ఫోర్త్ సిటీని.. కాలుష్యరహిత నగరంగా రూపొందించేందుకు.. అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో.. మెట్రో రైల్‌తో పాటు గ్రీన్ కారిడార్ ప్రముఖ పాత్ర వహించనున్నాయి.

ఐఏఎస్ అధికారులు కె.శశాంక, ఎస్. హరీశ్, బి. గోపి పేర్లు పరిశీలన

ఇక.. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీకి సంబంధించిన ప్రణాళిక, ఇంజనీరింగ్ విభాగాలకు సిబ్బందితో పాటు ఓ కమిషనర్‌ని కూడా నియమించనున్నారు. ఇందుకు గానూ.. ఐఏఎస్‌ అధికారులు కె.శశాంక, ఎస్‌.హరీశ్‌, బి.గోపి పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే.. ఎఫ్‌డీసీఏ కోసం కొత్తగా 90 పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిలో 34 రెగ్యులర్‌ పోస్టులు కాగా, మిగిలిన 56 పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌ పద్థతిలో భర్తీ చేస్తారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధితో.. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న నగరాన్ని.. కోర్ అర్బన్‌గా ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్‌గా, మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణకు పరిగణించనున్నారు. ఈ మేరకు.. సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించి.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది ప్రభుత్వం.

Related News

Rain Alert: మరి కాసేపట్లో భారీ వర్షం.. త్వరగా ఆఫీసులకు చేరుకోండి, లేకపోతే…

Telangana Congress: కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్లుగా ఫోకస్ అవుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్

Bhuvanagiri collector: పల్లెకు వెళ్లిన భువనగిరి కలెక్టర్.. సమస్యలన్నీ ఫటాఫట్ పరిష్కారం!

BRS BC Meeting: బీఆర్ఎస్ కరీంనగర్ బీసీ సభ వాయిదా..? కాంగ్రెస్ ధర్నా సక్సెసే కారణమా?

CM Revanth Reddy: కేంద్రంలో బీజేపీని గద్దె దింపుతాం.. సిఎం రేవంత్ రెడ్డి

Konda Surekha: బీజేపీపై బిగ్ బాంబ్ విసిరిన కొండా సురేఖ.. రాష్ట్రపతినే అవమానించారంటూ కామెంట్స్!

Big Stories

×