UP Crime News: యూపీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఏకాంతానికి తమతో నో అన్నందుకు ఇద్దరు వ్యక్తులు కలిసి 13 ఏళ్ల బాలుడ్ని అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటనలో పోలీసులు ఒకర్ని అరెస్ట్ చేయగా, మరొకరు కోసం గాలింపు మొదలు పెట్టారు. అసలు ఈ ఘటన వెనుక కారణమేంటి? ఎందుకు అలాంటి నీచానికి ఒడిగట్టారు? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్దాం.
అసలేం జరిగింది?
అసలే రంజాన్ మాసం.. నియమ నిష్టలతో ప్రార్థనలు, ఉపవాస దీక్షలు చేస్తారు. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం కామంతో కళ్లు మూసుకుపోయారు. ఏకాంతానికి ఇద్దరు తహతహలాడారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు అజార్‌కి మ్యారేజ్ అయ్యింది. పవిత్ర మాసం కావడంతో ఏకాంతానికి ఆయన భార్య ససేమిరా అంది. ఇతడి ఫ్రెండ్ హుస్సేన్ మరొకడు. వాడికి ఇంకా పెళ్లి కాలేదు. కాకపోతే గాళ్‌ఫ్రెండ్ ఉంది. ఆమెతో కామ వాంఛ తీర్చుకోవాలని భావించాడు. రంజాన్ నెలలో ఇలాంటివి సరైనది కాదని తేల్చి చెప్పేసింది.
యూపీలో దారుణం
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మార్చి ఫస్ట్ వీక్‌లో ఒక ఘటన జరిగింది. స్థానిక జిమ్‌కు వెళ్తుండగా 13 ఏళ్ల బాలుడిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఆ తర్వాత బాలుడ్ని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి తాడుతో కట్టేశారు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తమ పనైపోతుందని భావించారు నిందితులు. వెంటనే తాడుతో యువకుడి గొంతు నులిమి హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేశారు.
ఈ ఘటనలో హుస్సేన్‌ని అరెస్టు చేసిన పోలీసులు మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. మతపరమైన కట్టుబాట్ల కారణంగా తమతో ఏకాంతానికి బాలుడు నిరాకరించాడని, అందుకే ఈ పని చేశామని నిందితుడు పోలీసులకు విడమరిచి చెప్పేశారు.
ALSO READ: కారుని ఢీ కొన్న ట్రావెల్ బస్సు.. సజీవ దహనమైన తల్లి, కొడుకు
నిందితుడితో బాలుడి పేరెంట్స్
మార్చి ఐదున కాన్పూర్‌లో మైనర్ బాలుడు కనిపించలేదు. కొడుకు కోసం వెతుకుతున్నారు తల్లిదండ్రులు. బాలుడి ప్రాంతంలో నిందితుడు హుస్సేన్ ఫ్యామిలీ ఉంటుంది. అయితే బాలుడి పేరెంట్స్ హుస్సేన్‌ను సంప్రదించారు. తమ బాబు కనిపించలేదని చెప్పారు. ఈలోగా కిడ్నాపర్లు ఫోన్లకు ఏవైనా సందేశాలు పంపారా? ఫోన్‌లను ఒక్కసారి తనిఖీ చేయాలని సలహా ఇచ్చాడు.
తమలో ఒకరికి 10 లక్షలు ఇవ్వాలని తమ ఫోన్‌కు మెసేజ్ ఉంది. మైనర్ కిడ్నాప్ రోజు రాత్రి హుస్సేన్ కనిపించలేదు. కానీ మరుసటి రోజు ఉదయం అక్కడే ఉన్నాడని గ్రహించారు పేరెంట్స్. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. హున్సేన్‌ని విచారించినప్పుడు పోలీసులు అతడి వాంగ్మూలంలో తేడాలు కనిపించాయి. తమదైన శైలిలో విచారణ చేపట్టేసరికి నిజం ఒప్పేసుకున్నాడు నిందితుడు.
కచ్చితంగా శిక్షించాలని డిమాండ్
తాను, అజార్ కలిసి బాలుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు అంగీకరించాడు. అసలు యవ్వారం బయటపడింది. కామంతో కళ్లు మూసుకుపోయి ఆ ఇద్దరు వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని బాధిత బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని డీసీపీ బ్రజేంద్ర ద్వివేది తెలిపారు.