Visakhapatnam railway station: విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇక పూర్తిగా కొత్త రూపం దాల్చబోతోంది. పాతదైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ క్రమంగా రిటైర్ అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. రైలు పట్టాలపై అత్యవసర నడకలు, ఇక నెమ్మదిగా తప్పే ఛాన్స్ చేరువకానుంది. ఎందుకంటే.. భారత రైల్వేలోనే ఒక గొప్ప మార్పుగా, హౌరా స్టైల్ ఎండ్ ప్లాట్‌ఫామ్ విధానాన్ని విశాఖ స్టేషన్‌లో తీసుకురావడానికి పనులు మొదలయ్యాయి.
72 మీటర్ల వైపు ఎయిర్ కాంకోర్స్.. స్టేషన్‌కి ఆకాశ మార్గం!
ఇది మామూలు మార్గం కాదు బాస్.. ఈ ఎయిర్ కాంకోర్స్ అంటే ఏకంగా 72 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీనివల్ల, స్టేషన్‌లోని ప్రతి ప్లాట్‌ఫామ్ ఒకదానితో ఒకటి పూర్తిగా కనెక్ట్ అవుతుంది. ఎక్కడైనా దిగినా, ఏదైనా ప్లాట్‌ఫామ్‌కు నడిచిపోవచ్చు. ఎలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అవసరం లేదు. ఎలాంటి చిల్లర్లు, రద్దీ, తిప్పలు లేవు.
ఎయిర్ కాంకోర్స్ లో షాపింగ్, కాఫీ, కంఫర్ట్ అన్నీ ఓకే!
ఈ కాంకోర్స్ కేవలం నడవడానికి మాత్రమే కాదు. ఇందులో రెండు వైపులా షాపులు, కాంటీన్లు, కమర్షియల్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వాల్తేరు డివిజన్ అధికారి లలిత్ బొహ్రా తెలిపారు. అంటే మీరు ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు నడుస్తూ సరదాగా షాపింగ్ చేయొచ్చు, కాఫీ తాగొచ్చు, బ్రౌజింగ్ చేయొచ్చు.
రైల్వే స్టేషన్ నుంచే నేరుగా మెట్రో స్టేషన్‌కే!
ఇంకో సూపర్ విషయం ఏంటంటే.. ఈ ఎయిర్ కాంకోర్స్ నేరుగా విశాఖ మెట్రో స్టేషన్‌తో కనెక్ట్ అవుతుంది. అంటే రైలు దిగిన తర్వాత బయటకు రావాల్సిన అవసరం లేకుండానే, అదే కాంకోర్స్ మీదుగా నేరుగా మెట్రోలో ఎక్కేసేయొచ్చు. ఈ ‘సేమ్ కాంకోర్స్ కనెక్టివిటీ’ విషయమై మెట్రో అధికారులతో చర్చలు జరుగుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Also Read: Shivamogga bridge: కాస్త టైమ్ ఉందా? ఈ కేబుల్ బ్రిడ్జిపై జర్నీ ప్లాన్ చేసేయండి!
అంతర్జాతీయ లెవెల్ అనుభూతి.. డబ్బా మారేది కాదు!
ఇకపై విశాఖ రైల్వే స్టేషన్‌లో ప్రయాణం అంటే.. అంతర్జాతీయ విమానాశ్రయంలా అనిపిస్తుంది. శుభ్రత, షాపింగ్, ప్రయాణానికి సౌకర్యం అన్నీ చక్కగా సిద్ధమవుతున్నాయి. ఒక్కసారి ఈ కొత్త మార్గం సిద్ధమైతే, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశంలోనే అత్యాధునిక రైల్వే స్టేషన్‌గా విశాఖ నిలుస్తుంది.
అదేంటి ‘ఎండ్ ప్లాట్‌ఫామ్’?
ఇప్పటివరకు మనం ప్లాట్‌ఫామ్ మధ్యలో ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జుల మీద నుంచి నడిచేలా ఉండేది. కానీ ఎండ్ ప్లాట్‌ఫామ్ అంటే.. అన్ని ప్లాట్‌ఫామ్‌లు చివరన ఒకే చోట కలిసేలా ఉండడం. అంటే చివరన ఉన్న ఓ పెద్ద కారిడార్ మీద నుంచి ఏదైనా ప్లాట్‌ఫామ్‌కి నేరుగా వెళ్లొచ్చు. ఇది ట్రావెలర్స్‌కి టైమ్ సేవ్ చేస్తుంది, ముఖ్యంగా పెద్ద వయస్సువారికి, పిల్లలతో ఉండే కుటుంబాలకు ఇదొక గొప్ప సదవకాశమని చెప్పవచ్చు.
ఈ మార్పుతో విశాఖ స్టేషన్ ట్రావెలింగ్ జర్నీ మాత్రమే కాదు, ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్‌కి దారితీస్తుంది. ఇకమీదట ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఎక్కడానికి వస్తే.. వెనక్కి తిరిగి వెళ్లాలనిపించదు. అందుకే ఇది స్టేషన్ కాదు.. స్టైలిష్ స్టార్ట్‌పాయింట్.