BigTV English

CM Revanthreddy team discuss: హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. చార్లెస్ స్క్వాబ్.. దేశంలో తొలి సెంటర్‌కు ప్లాన్

CM Revanthreddy team discuss: హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. చార్లెస్ స్క్వాబ్.. దేశంలో తొలి సెంటర్‌కు ప్లాన్

CM Revanth Reddy latest news(Telangana today news): తెలంగాణకు విదేశీ పెట్టుబడులను రప్పించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది సీఎం రేవంత్‌రెడ్డి టీమ్. ప్రస్తుతం అమెరికా టూర్‌లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి , ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడి నుంచి పారిశ్రామిక వేత్తల వరకు వరుసగా సమావేశాలు, ఒప్పందాలు చేసు కుంటున్నారు.


తాజాగా డాలస్‌లో అంతర్జాతీయ ఫైనాన్స్ సర్వీస్ సంస్థ చార్లెస్ స్క్వాబ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇండియాలో తొలి టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభిం చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రం డాలస్‌లోని చార్లెస్ స్క్వాబ్ కంపెనీ ప్రతినిధులతో దాదాపు నాలుగైదు గంటలపాటు సమావేశమయ్యారు.

ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఈ సంస్థకు మాంచి పేరు ఉంది. మల్టీనేషన్ కంపెనీ అయిన చార్లెస్ స్క్వాబ్.. బ్యాంకింగ్, వాణిజ్య బ్యాంకింగ్, పెట్టుబడి రిటైల్ సంస్థాగత ఖాతాదారులకు కన్సల్టింగ్ సేవలు, సలహాలను అందిస్తుంది. వ్యాపారం విస్తరణలో భాగంగా ఈ కంపెనీ ఇండియాలో ఆఫీసును పెట్టాలని భావిస్తోంది.


ALSO READ: సీఎం రేవంత్‌రెడ్డి ప్లాన్ సక్సెస్, ప్రపంచబ్యాంక్ గ్రీన్‌సిగ్నల్

ఇందుకోసం సరైన ప్రాంతాన్ని ఎంచుకోవాలని ఆలోచన చేస్తోంది. ఈలోగా రేవంత్ టీమ్ ఆ కంపెనీ ప్రతినిధులు డెన్నిస్ హోవార్డ్, రామ బోక్కాలతో సమావేశమై హైదరాబాద్ సిటీ గురించి చెప్పింది. తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇలాంటి ఫేమస్ సంస్థలు ఇండియా రావడం, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతాన్ని ఎంచుకోవడం శుభపరిణామంగా భావిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×