Big Stories

CM Revanth Reddy on BRS Party: కారు కార్ఖానాకు పోయింది.. ఇక తూకం కింద అమ్ముకోవాల్సిందే: సీఎం రేవంత్!

CM Revanth Reddy Comments on BRS Party: కారు కార్ఖానాకు పోయింది.. ఇక తూకం కింద అమ్ముకోవాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కారు పార్టీ పని అయిపోందని.. ఇక మళ్లీ అధికారంలోకి రాదని పేర్కొన్నారు. కేసీఆర్ పనైపోయిందని అన్నారు. సెమీఫైనల్స్‌లో కేసీఆర్‌ను ఓడించామని.. ఫైనల్స్‌లో గుజరాత్‌ను ఓడించి అధికారం చేజిక్కించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెం జన జాతర సభలో పిలుపునిచ్చారు.

- Advertisement -

ఖమ్మం జిల్లా పోరాటం మిగిలిన జిల్లాలకు ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులని.. నక్క జిత్తుల మోసాన్ని ఈ ప్రాంతం ప్రజలు ముందే పసిగట్టారని తెలిపారు. అందుకే గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటే ఇచ్చారన్నారు. కార్మికుల సమస్యలపై పోరాడిన ఘనత ఖమ్మం జిల్లాదని స్పష్టం చేశారు. దేశ రాజకీయాలకు ఖమ్మం జిల్లా ఆదర్శమైందని, ఖమ్మంలో కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

నామా నాగేశ్వర్ రావు ఏ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అవుతారో బీఆర్ఎస్ చెప్పాలని, బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆయన ఆరోపించారు. అందుకే అనేకసార్లు బీజేపీ బిల్లులకు కేసీఆర్ మద్దతిచ్చారన్నారు. సెమీ ఫైనల్స్ లో బీఆర్ఎస్ ను ఓడించాం.. ఫైనల్స్ లో బీజేపీని ఓడించాలన్నారు.

Also Read: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి

ఈ నెల 9 వరకు రైతుబంధు డబ్బులు వేస్తామన్నారు. 9వ తేదీ తరువాత రైతుబంధు పడని రైతు ఉండడు.. రైతు బంధు వేస్తే ముక్కు నేలకు రాస్తావా? అంటూ కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అదేవిధంగా ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి తీరుతామని ఆయన అన్నారు. సిద్ధిపేటకు శని వదిలిస్తానని, ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి హరీశ్ రావుకు బుద్ధిచెబుతామన్నారు. ఇది గమనించిన హరీశ్ రావు పారిపోయేందుకు ప్లాన్ వేస్తున్నారంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News