BigTV English

Vijay Deverakonda New Movie: విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో దిల్‌రాజు మ‌రో మూవీ.. టైటిల్ ఇదే!

Vijay Deverakonda New Movie: విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో దిల్‌రాజు మ‌రో మూవీ.. టైటిల్ ఇదే!

Vijay Deverakonda – Dil Raju New Movie: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు కనబరచలేక పోయింది. ఈ మూవీ నిర్మాత దిల్ రాజు కూడా ఫ్యామిలీ స్టార్‌పై బాగా హైప్ పెంచాడు. కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఫ్లాపుల్లో ఉన్న విజయ్‌కి ఈ సినిమా అయినా గట్టెక్కిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ మూవీతో కూడా విజయ్‌కి గట్టి దెబ్బ పడింది.


రొటీన్ స్టోర్, ఫ్యామిలీ ఎమోషన్స్, అవుట్‌డేటెడ్ స్టోరీలైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌కి అంతగా కనెక్ట్ కాలేకపోయింది. దీంతో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన నెల లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ఇక ఇప్పుడు విజయ్ మరొక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు.

ఇందులో భాగంగానే విజయ్ తన కొత్త సినిమాను ఇవాళ (శనివారం) అఫీషియల్‌గా ప్రకటించాడు. ఇక ఈ చిత్రాన్ని కూడా నిర్మాత దిల్ రాజే నిర్మిస్తున్నాడు. రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ‘రాజావారు రాణిగారు’ సినిమా ఫేం రవికిరణ్ కోలా దర్శకత్వం వహించబోతున్నాడు. దర్శకుడిగా ఈ మూవీ అతడి రెండో సినిమా.


Also Read: మూడు వారాలకే ఓటిటీ బాట పట్టిన ఫ్యామిలీ స్టార్!

ఇందుకు సంబంధించిన అప్డేట్‌ను తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అలాగే పూర్తి వివరాల్ని విజయ్ దేవరకొండ బర్త్ డే రోజున అంటే మే 9న వెల్లడించబోతున్నట్లు తెలిపారు. మే 9న ఈ చిత్రం లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ – రవికిరణ్ కోలా కాంబో మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో రూపొందబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఈ మూవీలో విజయ్ దేవరకొండ రగ్గడ్ అండ్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే.. ఈ మూవీ మరొక రేంజ్‌లో ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాకు ‘రౌడీ జనార్థన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా దిల్ రాజు నిర్మిస్తున్న 59వ చిత్రం ఇది.

Also Read: Rana About Prabhas: ప్రభాస్ ఎవరు? అని అడిగారు.. మహేశ్ బాబు కూడా నమ్రత భర్తగా మాత్రమే తెలుసు.. రానా

ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం స్పై యాక్షన్‌గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దీని తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ విజయ్ కెరీర్‌‌లో భారీబడ్జెట్‌తో రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×