BigTV English

Rohit Vemula Mother Meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి!

Rohit Vemula Mother Meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి!

Rohit Vemula Mother Meets to CM Revanth Readdy: సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ రోహిత్ వేముల తల్లి, కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రోహిత్ వేముల కేసు విషయంలో పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు.


అయితే, రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించి శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణను ముగిస్తున్నట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని, అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అదేవిధంగా రోహిత్ వేముల ఎస్సీ సామాజికవర్గానికి చెందిన యువకుడు కాదంటూ పోలీసులు కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పేర్కొన్నారు.

Also Read: Hyderabad Pubs : హైదరాబాద్ పబ్‌లపై టాస్క్ ఫోర్స్ కొరడా.. ఆఫ్టర్ 9 పబ్ లో రైడ్స్


ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం యూనివర్సిటీలో ఆందోళన నిర్వహించారు. రోహిత్ వేముల కుటుంబ సభ్యులు, పలువురు నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రోహిత్ వేముల ఆత్మహత్య కేసును రీఓపెన్ చేసి విచారించనున్నట్లు పోలీసులు తెలిపిన విషయం విధితమే. ఇందుకు సంబంధించి కోర్టు అనుమతి కోరనున్నట్లు కూడా పోలీసులు తెలిపారు.

కాగా, రోహిత్ వేముల ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారి తీసిన విషయం విధితమే. దళిత విద్యార్థుల పట్ల యూనివర్సిటీల్లో వివక్ష కొనసాగుతోందంటూ విద్యార్థులు యూనివర్సిటీలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు గల కారణమైన వ్యక్తులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, దళిత విద్యార్థుల పట్ల వివక్ష కొనసాగుతుందని, వివక్ష చూపుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

Also Read: రోహిత్ వేముల కేసులో కీలక పరిణామం..

విద్యార్థులకు మద్దతుగా పలువురు రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాల నేతలు నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా హెచ్ సీ యూకి వెళ్లి విద్యార్థులకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×