BigTV English

CM Revanthreddy: రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. వరదలపై సాయం కోసం..

CM Revanthreddy: రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. వరదలపై సాయం కోసం..

CM Revanthreddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.  ఈ టూర్‌లో భాగంగా కేంద్రమంత్రులను కలవనున్నారు. ఇటీవల వచ్చిన వరదల వల్ల తెలంగాణలోని నాలుగైదు జిల్లాలు సర్వ నాశనమయ్యాయి. జరిగిన నష్టానికి కేంద్రానికి వివరించనున్నారు.


రెండురోజుల టూర్‌లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించనున్నారు. ఇందులో భాగంగా గురువారం హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. మహబూబాబాద్‌లో 200 హెకార్టలో వరద బీభత్సానికి నాశనమైన చెట్లు, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో జరిగిన నష్టాన్ని గురించి వివరించనున్నారు.

ALSO READ: పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం


అమిత్ షాతోపాటు అటవీ పర్యావరణ, ట్రాన్స్‌పోర్టు మంత్రులతో సీఎం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు జరిగిన నష్టానికి పెద్ద ఎత్తున సాయం అందించాలని కోరనున్నారు. వరదల కారణంగా జరిగిన నష్టంపై ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారు ముఖ్యమంత్రి.

మరోవైపు హస్తినలో గురువారం కీలక కాంగ్రెస్ నేతలు అందుబాటులో ఉండనున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని బుధవారం రాత్రికి ఢిల్లీకి రానున్నారు అగ్రనేత రాహుల్‌గాంధీ. ఈ క్రమంలో  కేబినెట్ విస్తరణతోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఇతర రాజకీయ అంశాలపై ముఖ్యనేతలతో చర్చించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. పీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఈనెల 15న బాధ్యతల స్వీకరణ ఉండడంతో ఆ కార్యక్రమానికి పార్టీ హైకమాండ్ కీలక నేతలను ఆహ్వానించునున్నారు కొత్త పీసీసీ అధ్యక్షుడు. పనిలోపనిగా సంస్థాగత అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×