BigTV English

CM Revanthreddy serious: సీఎం రేవంత్ సీరియస్.. డీజీపీకి ఆదేశాలు

CM Revanthreddy serious: సీఎం రేవంత్ సీరియస్.. డీజీపీకి ఆదేశాలు

CM Revanthreddy serious: తెలంగాణ, హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పనవి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీని ఆదేశించారు.


అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపు తున్నారన్న ఆయన, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్‌గా వ్యవహరించాలని డీజీపీకి సూచించారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం పోలీస్ యంత్రాంగంపై సమీక్ష చేయాలని చేయాలని డీజీపీని ఆదేశించారు.

గడిచిన రెండురోజులుగా బీఆర్ఎస్‌లో అంతర్గత కలహాలు ముదిరిపాకాన పడ్డాయి. ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డి మధ్య జెండా వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో గురువారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.


ఈ క్రమంలో ఎమ్మెల్యే గాంధీ అనుచరులు వెంటబెట్టుకుని అక్కడకు వెళ్లడంతో మరింత జఠిలమైంది. దీంతో ఎమ్మెల్యేల అనుచరులు ఒకరిపై మరొకరు రాళ్లు, టమాటాలతో దాడులు చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎమ్మెల్యే గాంధీని అరెస్ట్ చేసి నార్సింగి పీఎస్‌కు తరలించారు.

ALSO READ: ఎమ్మెల్యే అరికపూడి గాంధీ.. పార్టీలో ప్రాంతీయ విభేదాలు వద్దన్నాను, అయినా..

ఎమ్మెల్యే అరికపూడి గాంధీతోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపైనా కేసు నమోదు చేశారు. నేతల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేలా పోలీసులు చర్యలు చేపట్టిన విషయం తెల్సిందే.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×