BigTV English

Brahmamudi Serial : కావ్య కోసం ఏడ్చిన కళ్యాణ్.. బండరాయిలా రాజ్.. పార్టీ చేసుకున్న రాహుల్, రుద్రాణి

Brahmamudi Serial : కావ్య కోసం ఏడ్చిన కళ్యాణ్.. బండరాయిలా రాజ్.. పార్టీ చేసుకున్న రాహుల్, రుద్రాణి

Brahmamudi serial today September 13th Episode : నువ్వు కవిలా ఆలోచిస్తున్నావు కళ్యాణ్. కవిత్వం వేరు వాస్తవం వేరు. అయినా ఒకవైపు అమ్మ చావుబతుకుల్లో ఉంటే.. అందుకు కారణమైన మనిషిని వెనకేసుకొస్తూ.. నన్నే ప్రశ్నిస్తున్నావా? మన అన్నదమ్ముల్ల బంధాన్నే అనుమానిస్తున్నావా? అంటూ రాజ్ బాధపడతాడు. నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తుల కోసం మన ఇద్దరి మధ్య మనస్పర్థలు రాకూడదు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా నువ్వు ప్రశాంతంగా వెళ్లిపో కళ్యాణ్ అంటాడు రాజ్.


కావ్య తప్పు చేసింది కాబట్టే ఇంట్లోంచి వెళ్లిపోయిది: రాజ్

దీంతో నేను ప్రశాంతంగా వెళ్లిపోవాలంటే నువ్వు వెళ్లి వదినను ఇంటికి తీసుకురావాలి అన్నయ్యా అంటాడు కళ్యాణ్. కళ్యాణ్ మాటలకు రాజ్ స్పందిస్తూ.. అలా ఎప్పటికీ జరగదని నేను ఎప్పటికీ అలా చేయనని.. తను తప్పు చేసిందని ఫీల్ అయింది కాబట్టే ఇంట్లోంచి వెళ్లిపోయింది. లేకుంటే వెళ్లేదే కాదు. తను గిల్టీగా ఫీలయింది కాబట్టే ఆ వ్యక్తి ఇక్కడి నుంచి పారిపోయింది అంటాడు రాజ్. దీంతో కళ్యాణ్.. వదిన పారిపోలేదు అన్నయ్య. భర్తగా నువ్వు నిలబడాల్సిన విధంగా నిలబడలేదు. నమ్మాల్సిన విధంగా నమ్మలేదు కాబట్టి మనసు విరిగిపోయి తనే ఇక్కడి నుంచి వెళ్లిపోయింది అనగానే అయినా నేను వెళ్లి తీసుకురావడానికి నేను ఇంట్లోంచి వెళ్లగొట్టలేదు. తనకై తానే వెళ్లిపోయింది. నేను ఏ తప్పు చేయలేదు. తనను నేను వెళ్లి తీసుకొచ్చే ప్రసక్తే లేదు. అని రాజ్ కరాకండిగా చెప్పేసరికి కళ్యాణ్.. అన్నయ్యా ఇంత బండరాయిలా ఎప్పుడు మారిపోయావు. ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. అప్పుడే నీకు వదిన విలువ తెలుస్తుంది అంటూ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు.


ధాన్యలక్ష్మీని తిట్టిన కళ్యాణ్

కళ్యాణ్ వెళ్లిపోతుంటే ధాన్యలక్ష్మీ అడ్డుగా వస్తుంది. పరాయి ఇంటి ఆడదాన్ని బాగా అర్థం చేసుకున్నావు. కానీ ఈ కన్నతల్లిని ఎందుకు అర్థం చేసుకోలేదు అని అడుగుతుంది. దీంతో కళ్యాణ్ కోపంగా ధాన్యలక్ష్మీని తిడుతూ వదిన ఇల్లు వదిలి వెళ్లిపోవడంలో నీ పాత్ర ఎంత ఉందని నిలదీస్తాడు. ముందు నువ్వు బుద్ది మార్చుకో అంటూ ధాన్యలక్ష్మీకని తిట్టి కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

తాగి సంతోషంగా చిందులేసిన రాహుల్, రుద్రాణి

తర్వాత తాము అనుకున్నది సక్సెస్ అయిందని రుద్రాణి, రాహుల్ సంతోషంగా డ్యాన్స్ చేస్తుంటారు. డీజే టిల్లు సినిమాలో సాంగ్ వేసుకుని ఫుల్ ఖుషీగా చిందులు వేస్తుంటారు. ఇంతలో స్వప్న వస్తుంది. స్వప్నను చూసిన రాహుల్, రుద్రాణి తాము మాట్లాడుకుంది వినేసిందా? అని టెన్షన్ పడుతుంటారు. స్వప్న ఇద్దరిని తిడుతుంది. ఇంట్లో ఇంత పెద్ద గొడవ అయితే మీరు డాన్స్ చేస్తున్నారా? అంటూ నిలదీస్తుంది. అపర్ణ అత్త హాస్పిటల్లో ఉన్నారు. అవేం పట్టించుకోకుండా తాగి చిందులేస్తున్నారా? అసలు మీరు మనుషులేనా అంటూ.. మా చెల్లి, అపర్ణ అత్త విషయంలో మీ హస్తం ఏమైనా ఉందా? ఉంటే మీకు చిత్తడే అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది స్వప్న.

Also Read:  విశాల్ ను చంపేందుకు తిలోత్తమ కుట్ర.. బుద్ధిచెప్పిన గాయత్రి పాప

మా పెద్దరికం ఇంట్లో పనిచేయడం లేదు: ఇందిరాదేవి

మరోవైపు కనకం, కృష్ణమూర్తి కావ్య గురించి మాట్లాడుకుంటూ బాధపడుతుంటారు. ఇంతలో అక్కడ ఏం జరిగిందో మొత్తం తెలియాలంటే ఇందిరాదేవికి ఫోన్ చేయాలి అని ఫోన్ చేస్తుంది. కూతురు పుట్టింటికి వచ్చినా ఇంకా నమస్కారం చెబుతున్న నీ సంస్కారం నన్ను ఇంకా సిగ్గుపడేలా చేస్తుంది కనకం అంటుంది ఇందిరాదేవి. దీంతో తప్పు చేస్తే నిలదీసే పెద్దరికం మీకుంది. అలాగే నా కూతురు తప్పు చేయదన్న నమ్మకం నాకుంది. అసలు ఏం జరిగిందో తెలియక మేము కంగారుపడుతున్నాం అమ్మా అంటుంది కనకం. అయితే మీరు కంగారు పడటానికి తప్పు చేసింది నీ కూతురు కాదు కనకం నా మనవడు. దానికి మీరెందుకు భయపడుతున్నారు అంటుంది ఇందిరాదేవి. కానీ శిక్ష పడింది మాత్రం నా కూతురుకు కదమ్మా.. ఇప్పుడు నా కూతురు భవిష్యత్తు ఏంటో అర్థం కావడం లేదు అని కనకం దీనంగా అడగ్గానే ఇందిరాదేవి మా పెద్దరికాన్ని పక్కన పెట్టి ఎవరి నిర్ణయాన్ని వారే తీసుకున్నారు. నువ్వు అడిగే ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. నన్ను క్షమించు కనకం.. అంటూ ఇందిరాదేవి ఫోన్ కట్ చేస్తుంది.

కావ్యను తలుచుకుని కన్నీరు మున్నీరు అయిన కళ్యాణ్

ఇంకోవైపు కళ్యాణ్, అప్పు బాధపడుతుంటారు. వదిన వెళ్లిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది అంటూ ఏడుస్తుంటాడు. వాళ్లిద్దరూ ఎప్పటికీ దూరంగా ఉండాల్సిందేనా అంటూ బాధపడతాడు. తర్వాత ఇందిరాదేవి రాజ్ దగ్గరకు వెళ్లి తిడుతుంది. మీ పంతాలకు పోయి మా మనసులు కష్టపెడుతున్నారు అంటూ నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా ఆ పిచ్చిది నిన్ను భరించింది కానీ తెలియకుండా అది ఒక్క పొరపాటు చేసిందని ఇంట్లోంచి వెళ్లిపోతుంటే ఆపకుండా ఉండిపోయావు అంటూ బుద్ది చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.

Tags

Related News

Big tv Kissik Talks: గుడ్ న్యూస్ చెప్పిన విష్ణు ప్రియ.. మరోసారి ప్రెగ్నెంట్ అంటూ?

Big tv Kissik Talks: అమ్మకు క్యాన్సర్.. ఆఖరి చూపు కూడా లేదు.. కన్నీళ్లు పెట్టుకున్న విష్ణు ప్రియ!

Shobha Shetty: శోభా శెట్టి కొత్త వ్యాపారం.. దీని వెనుక ఉన్న సీక్రెట్ తెలుసా?

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ కుటుంబాన్ని కలిపేందుకు నర్మద ప్లాన్.. సాగర్ సర్ప్రైజ్.. ధీరజ్ కు లవ్ లెటర్..

Intinti Ramayanam Today Episode: పల్లవి పై కమల్ కు అనుమానం.. షాకిచ్చిన శ్రీయా.. అవని ప్లాన్ సక్సెస్ అవుతుందా..?

Nindu Noorella Saavasam Serial Today october 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు మిస్సమ్మ ల మధ్య గొడవ

Brahmamudi Serial Today October 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇంట్లోంచి వెళ్లిపోయిన కావ్య  

GudiGantalu Today episode: ప్రభావతి కోరిక తీర్చిన కామాక్షి.. మగాళ్లకు షాకిచ్చిన నాట్యమయూరి.. బాలు సెటైర్స్..

Big Stories

×