BigTV English

Ntr New Look : అబ్బా.. ఎన్టీఆర్ ఏమున్నాడు మామా..

Ntr New Look : అబ్బా.. ఎన్టీఆర్ ఏమున్నాడు మామా..

Ntr New Look : టాలీవుడ్ స్టార్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ పేరు తెలియని వాళ్ళు ఉండరు. త్రిపుల్ ఆరోగ్యం తర్వాత ఆయన రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఒక్క సినిమాతో ఆయన జాతకం పూర్తిగా మారిపోయింది. రాజమౌళి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత కొరటాల శివతో దేవర సినిమా చేశాడు. గ తేడాది రిలీజ్ అయిన సినిమా ఒకవైపు మిక్స్డ్ టాక్ ని అందుకున్న మరోవైపు భారీగా కలెక్షన్స్ ని రాబట్టింది.. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడని నందమూరి ఫ్యాన్సు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈసారి తెలుగులో కాకుండా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు ఎన్టీఆర్. బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఆ మూవీ ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది. సినిమాలు సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ న్యూ లుక్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ లుక్ లో ఎన్టీఆర్ ఎలా ఉన్నాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం..


మామూలుగా ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రమోటర్ గా ఉన్న ప్రతి యాడ్ భారీ సక్సెస్ ని అందుకున్నాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ ఓ యాడ్ కోసం తన లుక్కుని మార్చేశాడు ప్రస్తుతం ఆ లుక్కు ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు ఊహించినట్టుగా పవర్‌ఫుల్ స్టైల్ కాకుండా, కాస్త డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ యాడ్‌లో ఫ్రిజ్, వాషింగ్ మిషన్ వంటి హౌస్‌హోల్డ్ అప్లయెన్సెస్‌తో ప్రెజెంటేషన్ కొత్తగా ఉన్నప్పటికీ, ఎన్టీఆర్ లుక్ మాత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్‌ను తెచ్చుకుంది..

Also Read:‘వార్ 2’ మూవీ డ్యాన్స్ ప్రాక్టీస్ లో హృతిక్ రోషన్ కి తీవ్ర గాయాలు..


ఎన్టీఆర్ ఎప్పుడు తన స్టైల్ విషయంలో కొత్తగా ఉండాలని కోరుకుంటాడు. అదే విధంగా యాడ్స్ కు లుక్ ను చేంజ్ చేస్తాడు. తాజాగా డెలివరీ సర్వీస్ జెప్టో కోసం ఎన్టీఆర్ చేసిన ఈ బ్రాండ్ కమర్షియల్ ఇటీవల విడుదలైంది.. ఈ యాడ్‌లో నీలం రంగు హుడ్‌తో, కాస్త వింతగా ఉన్న హెయిర్ స్టైల్ అభిమానులను పూర్తిగా సంతృప్తి పరచలేదు. యాడ్ ఫన్నీ టోన్‌లో ఉన్నప్పటికీ, ఎన్టీఆర్ గెటప్ కాస్త అన్‌సెట్‌లింగ్‌గా అనిపించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆ లుక్కు ఏం బాగాలేదు అంటూ పెదవిరుస్తున్నారు. ఎలా ఉన్నా ఏంటి అన్ని ఎలా చేశారు అసలు యాడ్ ఎన్టీఆర్ పరువు తీసేలా ఉందంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై ఎన్టీఆర్ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి..

ఎన్టీఆర్ సినిమాలు విషయానికొస్తే.. బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ కాంబోలో మరో సినిమా చేస్తున్నాడు. అలాగే వీటితో పాటు తమిళ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×