Karimnagar MLAs meeting : కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో రాజకీయ పార్టీ నేతలు ఒకరి పై ఒకరు చేయి చేసుకున్నారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న అధికారులు, ఇతర నేతలు అవ్వాకయ్యారు. ప్రస్తుతం.. నేతల మధ్య ఈ గొడవ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. కలెక్టరేట్ లోని సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చ జరగుతుండగా.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య వాగ్వాదం జరిగింది.
ఏకంగా ఎమ్మెల్యేలే ఒకరిపైకి ఒకరు వచ్చారు. తొలుత సంజయ్ మాట్లాడుతుండగా.. అడ్డుకున్న పాడి కౌశిక్, సంజయ్ కి మైక్ అవ్వద్దు అంటూ అడ్డుకున్నారు. అసలు నువ్వు ఏ పార్టీ అంటూ వివాదాన్ని రేపారు. దీంతో.. క్రమంగా వివాదం పెద్దది అయ్యింది. అప్పటికే.. వారిని వారించేందుకు వచ్చిన ఇతర నాయకులు, ఎమ్మెల్యేల సమక్షంలోనే ఇరువురు నాయకులు.. ఒకరినొకరు తోసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన పాడి కౌశిక్.. తన నియోజకవర్గంలో 50 శాతమే రైతు రుణమాఫీ జరిగిందని, మిగతా వారికి మాఫీ అందించాలని కోరానంటూ తెలిపారు. డాక్టర్ సంజయ్ అమ్ముడుపోయారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కౌశిక్.. ఆయనకు ఆ పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అంటూ ఆగ్రహం వ్యాఖ్యానించారు. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. మీదకి వచ్చిన పాడి కౌశిక్.. తనను అడ్డుకోవడమే కాకుండా దురుసుగా మాట్లాడారని సంజయ్ ఆరోపించారు. జిల్లా అభివృద్ధి పై చర్చించకుండా.. అనవసర విషయాల్ని మాట్లాడుతూ, వ్యక్తిగత విమర్శలు చేశారంటూ ఆగ్రహించారు. వీరిద్దరి ఫైట్ తో ఒక్కసారిగా కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంగణంలో రాజకీయ వేడి రగులుకుంది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల తోపులాటలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తొటి ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా.. ఓరేయ్ అంటూ అసభ్యకర మాటల్ని కౌశిక్ వాడినట్లుగా వీడియోల్లో రికార్డ్ అయ్యింది. అలాగే.. ఎమ్మెల్యే సంజయ్ పైకి దూసుకెళ్లి, ఆయనపై దాడికి ప్రయత్నించినట్లుగా ఉండడంతో.. అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు సంఘటనా స్థలంలోనే ఉన్నారు. వివాదం పెద్దది కావడంతో.. పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని బయటకు లాకెళ్లారు. కాగా… ఇటీవలే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
ఎమ్మెల్యే సంజయ్‌పై పాడి కౌశిక్ రెడ్డి దౌర్జన్యం
కరీంనగర్ జిల్లా సమావేశంలో ఎమ్మెల్యేల గొడవ
సంజయ్‌తో గొడవ పడిన కౌశిక్ రెడ్డి
సంజయ్‌ను 'ఒరేయ్' అంటూ సంబోధించిన కౌశిక్ రెడ్డి
కరీంనగర్ కలెక్టరేట్‌లో సంజయ్ మాట్లాడుతుండగా అడ్డుపడిన కౌశిక్ రెడ్డి
ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్… pic.twitter.com/tgOR7tbHl9
— BIG TV Breaking News (@bigtvtelugu) January 12, 2025