BigTV English
Advertisement

Congress: మర్రిపై వేటు.. ఆరేళ్ల పాటు.. కాంగ్రెస్ షాక్

Congress: మర్రిపై వేటు.. ఆరేళ్ల పాటు.. కాంగ్రెస్ షాక్

Congress: సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిపై వేటు వేసింది కాంగ్రెస్ అధిష్టానం. అమిత్ షాను కలిసినందుకు గాను.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ.. ఆరేళ్ల పాటు ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించి షాక్ ఇచ్చింది.


తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానంటూ మర్రి మీడియా ముందు చెప్పిన కొన్నిగంటల్లోనే ఆయనపై వేటు వేసింది హైకమాండ్. టెక్నికల్ గా శశిధర్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ కు రిజైన్ చేయకపోవడంతో.. ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు పార్టీ ప్రకటించడం ఆసక్తికరం.

శుక్రవారం అమిత్ షాను కలిసిన మర్రి.. పార్టీలో చేరడంపై చర్చించినట్టు తెలుస్తోంది. బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం సందర్భంగా ఆయన కాషాయ కండువా కప్పుకోవచ్చని సమాచారం. అంతలోనే, శశిధర్ రెడ్డిపై వేటు వేస్తూ.. తామే పార్టీ నుంచి పంపించేశామనే మెసేజ్ ఇచ్చింది కాంగ్రెస్.


అంతకుముందు.. మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి బాగోలేదని.. తెలంగాణలో చెంచాగాళ్లతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారంటూ ఆరోపించారు. పీసీపీ పదవి రేవంత్‌ రెడ్డికి ఇవ్వొద్దని తాను కూడా అధిష్టానానికి చెప్పానన్నారు మర్రి.

తనలాంటి ఒక హోంగార్డు పార్టీ నుంచి పోతే పోయేదేమీ లేదంటూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డైలాగ్ ను రిపీట్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తాను కాంగ్రెస్ ను వీడుతున్నానంటూ చెప్పుకొచ్చారు శశిధర్ రెడ్డి.

టీఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదని.. హస్తం పార్టీకి క్యాన్సర్ సోకిందని.. అది నయం చేయలేని స్థితికి చేరిందంటూ సంచలన కామెంట్స్ చేశారు. తనలానే త్వరలోనే చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడుతారంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు.

మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేతగా ఉన్నారు. పీజేఆర్ ఉన్న కాలంలో హైదరాబాద్ బ్రదర్స్ గా హైకమాండ్ దగ్గర మంచి పరపతి ఉండేది. అయితే, ఆ తర్వాతి కాలంలో నియోజకవర్గంలో బలం తగ్గిపోవడం, వరుస ఓటమిలతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది. సీనియర్లతో సెపరేట్ గ్రూప్ మెయిటెన్ చేస్తున్నారనే ఆరోపణ ఉంది. ఇక కాంగ్రెస్ లో తన ఉనికి కష్టమేనని భావించిన మర్రి.. బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ను వీడుతున్నానంటూ ప్రకటించారు. ఆ విషయం తెలిసి ఆయనపై ఆరేళ్ల పాటు వేటు వేసింది హస్తం పార్టీ. త్వరలోనే మర్రి కాషాయ కండువా కప్పుకోవడం ఖాయం.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×