
Congress Bus Yatra 2.0 update(Telangana congress news) :
తెలంగాణ కాంగ్రెస్ మలివిడత బస్సుయాత్రతో ప్రచార ప్రభంజనానికి సిద్ధమైంది. అధికారమే లక్ష్యంగా ఎవరికీ అందని వ్యూహాలతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్న హస్తం నేతలు.. రెండో విడత విజయభేరీ యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇప్పటికే తొలి విడత యాత్ర విజయవంతంకావడంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఇదే జోరును కొనసాగిస్తూ 17 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సుయాత్ర సాగనుంది. శనివారం(అక్టోబర్28) నుంచి ప్రారంభంకానున్న ఈ విజయభేరీ యాత్రలోపార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొననున్నారు.
శనివారం.. బస్సు యాత్ర చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని తాండూరు, పరిగి, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనుంది. ఈ యాత్రలో డీకే శివకుమార్ పాల్గొని ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు తాండూరు, సాయంత్రం 4 నుంచి 5 వరకు పరిగి, సాయంత్రం 6 నుంచి 7 వరకు చేవెళ్లలో ఎన్నికల ప్రచారం సాగనుంది. అలాగే ఆదివారం సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాలలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ప్రచారం నిర్వహిస్తారు. మద్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటలకు వరకు ఎన్నికల ప్రచార సభలలో ఖర్గే పాల్గోనున్నారు. 3వ రోజు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జనగామ, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో.. 4వ రోజు నల్గొండ, నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నాగార్జున సాగర్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో, 5వ రోజు నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ లోక్ సభ పరిధిలోని జడ్చర్ల, షాద్ నగర్ నియోజకవర్గాల్లో, 6వ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరగనుంది.
ఇక ఇప్పటికే గెలుపే ఎజెండాగా.. అధికారమే లక్ష్యంగా.. పూర్వవైభవాన్ని నెలకొల్పే దిశగా విజయభేరి తొలియాత్ర సూపర్ సక్సెస్ అయింది. రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలతో సాగిన బస్సుయాత్రలో దమ్ములేపింది. రాహుల్, ప్రియాంక గాంధీలు ప్రచారంలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజల్లో ఎండగట్టారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. మూడు రోజులపాటు సాగిన ఈ యాత్రలో పార్టీ శ్రేణులతోపాటు భారీగా ప్రజలు తరలివచ్చారు. అడుగడుగునా అగ్రనేతలకు ఘనస్వాగతం పలికారు. ఇక ఈ యాత్ర విజయవంతంకావడంతో మలివిడత యాత్రకు సిద్ధమైంది హస్తం పార్టీ.
మరోపక్క సెకండ్ లిస్టు కూడా రిలీజ్‌కావడంతో నియోజకవర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానిక నేతలు 6 గ్యారంటీ స్కీంలను గడపగడపకు వెళ్లి వివరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని.. కేసీఆర్‌ను గద్దె దించేది తమ పార్టీనేనన్న ధీమాతో కాంగ్రెస్ నేతల ప్రచారం సాగుతోంది.
.
.
Revanth Reddy: ఎవరా శ్రీధర్‌రాజు? ధరణి దొరల గుట్టు రట్టు!.. రేవంత్ లీక్స్..