PAK VS SA MATCH : పాకిస్తాన్ కు అంపైర్ శాపం? ఆ నిర్ణయంతో గెలుపు దూరం..

PAK VS SA MATCH : పాకిస్తాన్ కు అంపైర్ శాపం? ఆ నిర్ణయంతో గెలుపు దూరం..

Share this post with your friends

PAK VS SA MATCH: దురదృష్టం అనే మాట అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అదిప్పుడు పాకిస్తాన్ విషయంలో నిజమైంది. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో  అంపైర్ నిర్ణయం పాకిస్తాన్ కి శాపంగా మారింది. అవుట్ అయినా సరే, టెక్నికల్ గా తేలకపోవడంతో అంపైర్ నిర్ణయానికి వదిలేశారు. అప్పటికే ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అన్నాడు. అలా పాకిస్తాన్ కి అదృష్టం కలిసి రాక ఓటమి పాలైంది. దీంతో అంపైర్ నిర్ణయంపై మాజీలు భగ్గుమంటున్నారు. ఈ మాత్రం దానికి డీఆర్ఎస్ ఎందుకని నిలదీస్తున్నారు. సాంకేతిక ఇంత పెరిగాక కూడా అంపైర్ కాల్, అంపైర్ డెసిషన్ అంటే ఎలా? అని మండిపడుతున్నారు.

ఇంతవరకు భారీ భారీ స్కోర్లు చేసిన సౌతాఫ్రికా ఎప్పుడెలా ఆడుతుందో దానికీ తెలీడం లేదు. అప్పుడే పులుల్లా ఆడుతున్నారు. అంతలోనే  తోకముడిచేస్తున్నారు. ఒకదశలో చివరి నలుగురు బ్యాటర్లు అయితే, బ్యాటింగ్ కి కొత్త అన్నట్టు ఆడారు. సింగిల్స్ తీయలేక టపటపా అయిపోయారు. చివరి వికెట్ తో పడుతూ లేస్తూ ఆ నాలుగు పరుగులు చేసి విజయం సాధించింది.

ఒత్తిడిలో ఉన్నప్పుడు అస్సలు ఆడలేమని పాకిస్తాన్ మ్యాచ్ లో సౌతాఫ్రికా మరోసారి రుజువు చేసింది. నిజానికి పాకిస్తాన్ 46.4 ఓవర్లకి ఆలౌట్ కాకుండా ఉంటే మరో 20 పరుగులైనా వచ్చేవి. అప్పుడు ఆట తీరు మరోలా ఉండేది.
ఇంతకీ అంపైర్ నిర్ణయం ఎందుకలా వచ్చిందంటే…

45 ఓవర్ జరుగుతోంది. అప్పుడే ఎంగిడి అవుట్ అయ్యాడు. విజయం కోసం ఒక్క వికెట్ దూరంలో పాకిస్తాన్, 11 పరుగుల దూరంలో సౌతాఫ్రికా ఉన్నాయి. అయితే రవూఫ్ వేసిన ఓవర్ చివరి బంతి బ్యాటర్ షంసీ ప్యాడ్‌కు తాకింది. ఎల్బీ కోసం పాక్ ఫీల్డర్లు అప్పీల్ చేశారు. అంపైర్ ఔటివ్వలేదు. దీంతో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ డీఆర్ఎస్ కోరాడు.

ఇక్కడే కథ మలుపు తిరిగింది. అల్ట్రా ఎడ్జ్‌లో బ్యాట్ తాకలేదని తేలింది. దీంతో పాకిస్థాన్ ఆటగాళ్లు అవుట్ అనుకున్నారు.  బాల్ ట్రాకింగ్‌లోకి చూసేసరికి పాకిస్థాన్‌ను దురదృష్టం వెంటాడింది. బంతి లెగ్ స్టంప్‌కు ఆనుకుంటూ వెళ్తున్నట్లు తేలింది. దీంతో థర్డ్ అంపైర్.. అంపైర్ కాల్ అని ప్రకటించాడు. అంతకు ముందే ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.ఇదే నిర్ణయానికి మెయిన్ అంపైర్ స్టాండ్ అయిపోయాడు.

ఇలా అందరూ కలిసి సౌతాఫ్రికా ఆఖరి బ్యాటర్ షంసీకి ఊపిరి పోసి బతికించారు. నిజానికి బంతి, కొంచెం లోపలికి పడి ఉండుంటే.. షంసీ ఎల్బీగా వెనుదిరిగేవాడు. సౌతాఫ్రికా ఆలౌట్ అయ్యేది. పాకిస్థాన్ గెలిచేది. కానీ వెంట్రుకవాసిలో పాకిస్తాన్ కి విజయం చేజారిపోయింది.

ఈ విషయంలో స్పిన్నర్ హర్భజన్ సింగ్ సీరియస్ అయ్యాడు. పాకిస్తాన్ కి మద్దతుగా నిలిచాడు. ఈ మాత్రం దానికి సాంకేతికత అనే మాట ఎందుకు? అంపైర్లు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే కదా…డీఆర్ఎస్ పెట్టిందని ప్రశ్నించాడు. అంపైర్ నిర్ణయాల వల్ల గెలవాల్సిన పాకిస్తాన్ ఓడిపోయిందని అన్నాడు. ఈ మాటని అందరూ సమర్థించడం మొదలుపెట్టారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

IND Vs NZ : చెలరేగిన భారత్ బ్యాటర్లు.. కివీస్ టార్గెట్ 386 రన్స్..

Bigtv Digital

Endala Mallikarjun Swamy Temple : శివ లింగాన్ని తాకిన గాలి పీల్చారా…?

Bigtv Digital

Sidhu: సిద్ధూ జైలు నుంచి వచ్చేశాడోచ్.. రాహుల్‌గాంధీ ఓ విప్లవం!

Bigtv Digital

KTR: సైఫ్ అయినా, సంజయ్ అయినా వదిలిపెట్టం.. ప్రీతి మృతిపై కేటీఆర్ రియాక్షన్..

Bigtv Digital

Lasya Nandita Audio Leak: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో భారీగా అక్రమాలు.. వైరల్ అవుతోన్న ఆడియో

Bigtv Digital

BRS: కేసీఆర్‌కు బ్రీఫింగ్!.. అఖిలేశ్ లంచ్ మీటింగ్.. ఏంటి సంగతి?

Bigtv Digital

Leave a Comment