BigTV English

High Command Call MLC Jeevan Reddy: కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు.. ఢిల్లీకి జీవన్‌రెడ్డి పయనం!

High Command Call MLC Jeevan Reddy: కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు.. ఢిల్లీకి జీవన్‌రెడ్డి పయనం!

High Command call to MLC Jeevan Reddy: తెలంగాణలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరికలపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అభ్యంతరాలు వ్యక్తంచేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా సొంత నియోజకవర్గానికి చెందిన వారిని పార్టీలోకి ఆహ్వానించడం అవమానంగా భావించారాయన. అంతేకాదు ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.


ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్లు రెండురోజులుగా మంతనాలు సాగించారు. ఆయన ఏమాత్రం మెత్తబడ లేదు. చివరకు మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారాయన. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తామని భీష్మించుకుని కూర్చొన్నారు.

పరిస్థితి గమనించిన పార్టీ హైకమాండ్ నుంచి బుధవారం ఉదయం జీవన్‌రెడ్డికి ఫోన్ వచ్చింది. వెంటనే ఢిల్లీ రావాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ నుంచి పిలిచారు. ఆయనను తీసుకుని మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరారు అడ్లూరి లక్ష్మణ్. హైకమాండ్ నుంచి కాల్ రావడంతో సీనియర్ నేత తన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గే ఛాన్స్ ఉందని నేతలు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో అలకలకు ఫుల్‌స్టాప్ పడడం ఖాయమని అంటున్నారు.


 

Tags

Related News

Congress VS BRS: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్‌లో టెన్షన్?

Sada Bainama: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆ 10 లక్షల మంది కష్టాలు తీరినట్టే..

Raja Singh: కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను చేస్తా.. రాజాసింగ్ సంచలనం

Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో రాత్రంతా కుండపోత వాన, పిడుగులు కూడా పడే ఛాన్స్

Nepal Crisis: నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలంగాణ హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవే..

Hhyderabad Rain Alert: ఈ ఏరియాల్లో దంచికొట్టనున్న వర్షాలు.. బయటకు వెళ్తే బుక్కైపోతారు

Big Stories

×