E-Paper
Advertisement

Hanumanthurao: రాజకీయ డ్రామాలొద్దు.. ఆ రెండు పార్టీలకు వీహెచ్ సూచన

Hanumanthurao: రాజకీయ డ్రామాలొద్దు.. ఆ రెండు పార్టీలకు వీహెచ్ సూచన
Advertisement

VHanumanthurao: బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీల వ్యవహారశైలిపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు. ఆ రెండు పార్టీలు శవాల మీద పేలాలు ఎరుకునే రకంగా వర్ణించారు. ఇప్పటికైన రాజకీయ డ్రామాలు ఆపాలని ఆ రెండు పార్టీలకు హితవు పలికారు.

బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టాలని ఎవరు సలహా ఇచ్చారని ప్రశ్నించారు. పుష్ప 2 సినిమా టికెట్ రేటును స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పెంచారని, దీనిపై అల్లు అర్జున్ ఒక్కసారి ఆలోచించాలన్నారు. సంధ్య థియేటర్ ఘటన అనంతరం జరిగిన పరిణామాలను పొలిటికల్ పార్టీలు ఎంత సేపటికీ రాజకీయ కక్ష అని అంటున్నాయని గుర్తు చేశారు.

Advertisement

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కక్ష సాధింపు చర్య అని అన్నారని వివరించారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, మణిపూర్‌లో 90 మంది చనిపోయారని, అక్కడ లా ఆర్డర్ లేదన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని, తప్పొద్దనే కారణంతో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ఎంపీ సునీల్‌దత్ తన కొడుకు సంజయ్ దత్ విషయంలో చేసిన తప్పును అంగీకరించారని, అల్లు అర్జున్ తండ్రి అరవింద్ కూడా ఈ విషయంలో మరోసారి ఆలోచించాలన్నారు. శ్రీతేజ్ కోలుకోవాలని అల్లు అర్జున్ మృత్యుంజయ యాగం చేయాలన్నారు. పుష్ప2 సినిమాకు వచ్చిన లాభాలు యాదగిరిగుట్ట స్వామి ఉండిలో వేయాలన్నారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×