BigTV English

Brain Tumor: మీలో ఈ లక్షణాలు ఉంటే అస్సలు లైట్ తీసుకోవద్దు, బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు

Brain Tumor: మీలో ఈ లక్షణాలు ఉంటే అస్సలు లైట్ తీసుకోవద్దు, బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు

Brain Tumor: మనలో చాలా మంది తరచుగా తలనొప్పి, సాధారణ జ్వరం వంటి సమస్యలను లైట్ తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన ఆరోగ్య దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుందని మీకు తెలుసా? అకారణంగా వచ్చే సమస్యలు, కొన్ని సందర్భాల్లో తీవ్రమైన వ్యాధులకు సంకేతాలు కావచ్చు. అందులో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఒకటి. ఇదిలా ఉండే రోజు రోజుకూ బ్రెయిన్ ట్యూమర్ బారిన పడే వారి సంఖ్య  పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరం బ్రెయిన్ ట్యూమర్ వల్ల 2.5 లక్షల మందికి పైగా మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.


2020లో బ్రెయిన్‌ ట్యూమర్‌, క్యాన్సర్‌ కారణంగా 2.46 లక్షల మంది చనిపోయారు. బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉన్నప్పటికీ.. చాలా ఏళ్ల వరకు పేషంట్లకు వ్యాధి ఉన్న విషయం తెలియదని వైద్యులు చెబుతున్నారు. అనేక సందర్భాల్లో బ్రెయిన్ లో కణితి చాలా నెమ్మదిగా పెరుగుతుంది. దాని లక్షణాలు ప్రారంభంలో అంతగా కనిపించవు. కానీ మీరు కొన్ని సాధారణ సంకేతాలపై ఖచ్చితంగా శ్రద్ద చూపించాల్సి అవసరం ఉంది. అందుకే తరచుగా వచ్చే తలనొప్పిని నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

బ్రెయిన్ ట్యూమర్ గురించి తెలుసుకోండి:


బ్రెయిన్ ట్యూమర్ లక్షణాల గురించి తెలుసుకునే ముందు, బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మెదడు కణితులు మెదడులో లేదా దాని చుట్టూ ఉన్న కణాల అనియంత్రిత పెరుగుదల కారణంగా ఏర్పడతాయి. ఇది క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు. మెదడులో 120 కంటే ఎక్కువ రకాల కణితులు అభివృద్ధి చెందుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కుటుంబంలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే, ఇతర వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇదే కాకుండా, ప్లాస్టిక్ , రసాయన పరిశ్రమలో పనిచేసే వ్యక్తుల్లో బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

బ్రెయిన్ ట్యూమర్‌లో తలనొప్పి లక్షణాలు:
బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కుంటారు. అంతే కాకుండాయ తలనొప్పి అనేది బ్రెయిన్ ట్యూమర్ యొక్క అత్యంత సాధారణ లక్షణం. ఉదయం వేళలో తలలో నొప్పి , ఒత్తిడి పెరగడం , నిరంతర తలనొప్పి చాలా సందర్భాలలో బ్రెయిన్ ట్యూమర్‌కి సంకేతం అని వైద్యులు చెబుతున్నారు. మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోండి.

మెదడు కణితి యొక్క లక్షణాలు దాని పరిమాణం, ప్రదేశంపై ఆధారపడి ఉంటాయి. అనేక సందర్భాల్లో మెదడు కణితి ఎంత వేగంగా పెరుగుతోందనే దానిపై కూడా లక్షణాలు ఆధారపడి ఉంటాయి. తలనొప్పి దాని ప్రారంభ సంకేతంగా పరిగణించబడుతుంది. అందుకే తరుచుగా తలనొప్పి వస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.

బ్రెయిన్ ట్యూమర్ యొక్క ఇతర లక్షణాలు:
మెదడు కణితితో బాధపడుతున్న వ్యక్తులు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతారు. ముఖ్యంగా వారిలో ఈ లక్షణాలు తప్పకుండా ఉంటాయి.

ఉదయం పూట తరుచుగా తలనొప్పి లేదా ఒత్తిడి.

తీవ్రమైన తలనొప్పి.

వికారం లేదా వాంతుల అనుభూతి.

అస్పష్టమైన దృష్టి, డబుల్ దృష్టి వంటి కంటి సమస్యలు.

చేతులు , కాళ్ళలో కదలిక తగ్గడం.

శారీరక సమతుల్యత, మాట్లాడటంలో ఇబ్బందిగా అనిపిస్తుంది.

కాలక్రమేణా జ్ఞాపకశక్తి సమస్యలు.

Also Read: బట్టతలపై కూడా జుట్టు రావాలంటే.. వీటిని పక్కా వాడాల్సిందే !

తరచుగా తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.

బ్రెయిన్ ట్యూమర్ ప్రతిసారీ క్యాన్సర్ కాదు

సకాలంలో చికిత్స తీసుకుంటే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

వయస్సు పైబడిన వారితో పాటు, స్థూలకాయులు, ఇతర ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతున్న వారైనా మెదడు కణితి యొక్క సంకేతాలపై తీవ్రమైన శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. వ్యాధిని సకాలంలో గుర్తించినట్లయితే కోలుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×